ఆన్ సైట్ యూనిట్లు ఏర్పాటు చేయాలి..


Ens Balu
3
East Godavari
2021-01-04 14:44:49

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పధకం క్రింద చేపట్టిన పెద్ద లేఅవుట్ లలో ఆన్ సైట్ సామగ్రి తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పధకం గృహనిర్మాణల కొరకు ఏర్పాటైన జిల్లా స్థాయి టెండర్ కమిటీ  సమావేశం జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా గత నెల 15న జారీ చేసిన టెండర్లకు బిడ్డర్ల నుండి తగిన స్పందన రాక పోవడంతో రిటెండరింగ్ కు పిలవాలని జెసి ఆదేశించారు.  అలాగే బిడ్డర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని శాఖలలో నమోదైన నిర్మాణ, సామగ్రి సరఫరా కాంట్రాక్టర్లతో మంగళవారం జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.   నిర్మాణ సామగ్రి రవాణా ఖర్చులు, తరలింపులో నష్టాలు తగ్గించేందుకు 5వేలు ఆపై ఇళ్లు నిర్మించే లే అవుట్ లలో అక్కడే తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించాలని, ఇందుకు అవసరమైన స్థలాలు, ముడి సరుకు టై అప్ వెసులుబాటులను తయారీదారులకు కల్పించాలని సూచించారు.  జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఫాల్జీ ఇటుకల తయారీ యూనిట్లను పెద్ద సంఖ్యలో ప్రోత్సహించాలని ఆదేశించారు.   అలాగే చిన్న లే అవుట్ లలోని ఇళ్ల కొరకు క్లస్టర్ల విధానంలో యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.  రిటెండరింగ్ లో ఎక్కవ మంది బిడ్డర్లు పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ధరావతు సొమ్మును తగ్గించాలని, చెల్లింపుల గురించి బిడ్డర్లలో అపోహలను తొలగించాలని జేసి(డి) అధికారులకు ఆదేశించారు.  ఈ సమావేశంలో హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, డిపిఓ నాగేశ్వరనాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జియం బి.శీనివాసరావు, ఆర్.అండ్.బి, ఆర్.డబ్ల్యూ.ఎస్., ట్రాన్స్కో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.