ఈవీఎం గోడౌన్ లకు పటిష్ట భద్రత..


Ens Balu
3
Kakinada
2021-01-04 14:53:20

తూర్పుగోదావరి జిల్లాలోని  ఈవియం యంత్రాల గోడౌన్ల భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం ఉదయం కలెక్టరేట్ ప్రక్కన ఉన్న ఈవిఎం గొడౌన్ ను జిల్లా కలెక్టర్  సందర్శించారు. ఎన్నికల కమీషన్ సూచనల కనుగుణంగా ప్రతి నెల నిర్వహించే ఈవియంల పరిశీలనలో భాగంగా ఆయన అధికారులతో కలిసి ఈ తనిఖీ జరిపారు.  ఈవియంల రక్షణ, భద్రత కొరకు చేపట్టిన ఏర్పాట్లను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు, ఎలక్షన్ విభాగం అధికారి యం.జగన్నాధం, కాకినాడ అర్భన్ తహశిల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.