సదరం క్యాంపుల సమాచారం తెలియజేయండి..
Ens Balu
4
Visakhapatnam
2021-01-04 15:03:07
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైన బాలలు,పెద్దలకు జారీచేసే వైకల్య ధృవీకరణ పత్రాలను జారీ కోసం స్లాట్లు జారీ చేసే సమాచారాన్ని దివ్యాంగులు సంక్షేమ శాఖ, వైద్య విధాన పరిషత్ అధికారులు, సమాచార శాఖ ద్వారా పత్రికలు, వివిధ టి.వి.ఛానెళ్లు,ఎఫ్.ఎం రేడియోలు ద్వారా ప్రచారం ఉధృతంగా చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం(సీఆర్పీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గొండు సీతారాం ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సోమవారం విశాఖలోని పెదవాల్తేరు దివ్యంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏ.డి..జి.వి.ఆర్.శర్మను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినతిని పరిశీలించిన శర్మ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ వాదనను జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకెళతానని చెప్పారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగాను ఇటు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం జనవరి,ఫిబ్రవరి నెలలకు గాను దివ్యాంగ బాలలకు,పెద్దలకు వైకల్య ధృవీకరణ పత్రాల జారీకి ఇటీవల ఉత్తర్వులు జారీచేయడం హర్షణీయమని అన్నారు. ఈ స్లాట్ ల నమోదు పై ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా పూర్తి సమాచారం లేక అత్యధిక శాతం మంది దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. సమాచార,సాంకేతిక వ్యవస్థ దగ్గరైన సమయంలో ఏ.సెంటర్లు,కేంద్రాల్లో ఎప్పుడు,ఎక్కడ నమోదు చేస్తున్నారో వార్డు,గ్రామ వాలెంటీర్లు,సచివాలయం సిబ్బందితో గడప, గడపకీ సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారమని అన్నారు. ఎ.డి.ని కలసిన వారిలో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కార్యదర్శి పి.శేఖర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆఫీస్ సూపరింటెండెంట్ జి.జగదీష్ తదితరులు ఉన్నారు.