అన్నవరం దేవస్థానంలో 50 మందికి కరోనా పాజిటివ్..


Ens Balu
3
Annavaram
2020-08-12 13:47:53

అన్నవరం, శ్రీ సత్యన్నారాయణస్వామి వారి దేవస్థానంలో 650 మంది సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించగా  50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈఓ వేండ్ర త్రినాధరావు తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వారంతా  హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఇంకనూ దేవస్థానంలో  పనిచేయు సిబ్బందికి 200 పైగా సిబ్బందికి పరీక్షలు నిర్వహించాల్సి వుందన్నారు.  దేవస్థానంలో కేసులు అధికంగా ఉన్నందున స్వామివారి దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేసి స్వామివారికి ఏకాంతముగా సేవలు చేయడానికి నిర్ణయించినట్టు చెప్పారు. నిన్న నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. హోమ్ క్వారంటైన్ లో వైద్యసేవలు పొందే వారంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మందులు వాడుతూ, బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఈఓ కోరారు.
సిఫార్సు