విజయనగరం స్పందనకు 220 వినతలు..
Ens Balu
5
Vizianagaram
2021-01-04 18:00:43
విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కు 220 వినతులు అందాయి. ముఖ్యంగా ఇళ్ళ స్థలాలు, పించన్ల, ఆరోగ్య శ్రీ , ఆదరణ, రైతు భరోసా, అమ్మ ఒడి లబ్ది కోసం దరఖాస్తులు అందాయి. జిల్లా కలెక్టర్ డా. హరి జవహర్లాల్, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, విపత్తుల శాఖ ప్రోజెక్ట్ అధికారి పద్మావతి వినతులను అందుకున్నారు. స్పందనలో అందిన వినతులను వెంటనే పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. స్పందన అనంతరం ధాన్యం సేకరణ , పౌర సరఫరాల వాహనాలు, జగనన్న తోడు, కన్వర్జెన్స్ పనులు, నాడు- నేడు , బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, తదితర కార్యక్రమాల పై కలెక్టర్ సమీక్షించారు. ఇ – సేవలు పెండింగ్ పై సమీక్షిస్తూ పౌర సరఫరాలు, జిల్లా రెవిన్యూ అధికారి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల వద్ద ఎక్కువగా ఊనయని, వాటిని ఈ రోజే క్లియర్ అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ధాన్యం సేకరణ లో మండల ప్రత్యేకాదికారులు కూడా దృష్టి పెట్టాలని అన్నారు. రైతులతో, మిల్లర్ల తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. నిర్దేశిత లక్ష్యం 5 లక్షల మెట్రిక్ టన్నులను ఫిబ్రవరి లోపలే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సంయుక్త కలెక్టర్ జే.సి.కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది సేకరణ వేగవంతం అవుతుందని, అందుకు పనిచేస్తున్న అధికార బృందానికి, డ్వాక్రా, మొలక సంస్థలకు అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తి తో పని చేయాలనీ ఎక్కడ ఏ సమస్య ఉన్న తన దృష్టి లోనికి వెంటనే తేవాలని జే.సి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ శాఖ ద్వారా జిల్లాకు కేటాయించిన 75,000 రూపాయల విలువ గల 5 టచ్ ఫోన్ లను 6 వేల విలువ గల రెండు వినికిడి యంత్రాలను స్పందన లో లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ అందజేసారు. ఈ కార్యక్రమం లో, ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలాకుమారి, విభిన్న ప్రతిభ వంతులశాఖ సహాయ సంచాలకులు నీలకంట ప్రధానో , జిల్లా అధికారులు పాల్గొన్నారు.