రేపు ఏయూలో అంతర్జాతీయ వెబినార్..
Ens Balu
3
Vizianagaram
2021-01-05 18:12:21
ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగంలో బుధవారం ఒకరోజు అంతర్జాతీయ వెబినార్‌ను నిర్వహిస్తున్నారు. వెబినార్ పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఏయూ వృక్షశాస్త్ర విభాగం, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ‘ ఇంటర్‌నేషనల్ కోడ్ ఆఫ్ నామిన్‌క్లేచర్ ఫర్ ప్లాంట్స్’ అంశంపై నిర్వహిస్తున్నాయి. సదస్సులో హార్వర్డ్ యూనివర్సిటీ ఆచార్యులు కె.ఎన్ గాంధీ కీలకోపన్యాసం అందిస్తారు. సదస్సులో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ ఏ.ఏ మావో, సదస్సు కన్వీనర్ బిఎస్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. శంకర రావు, వృక్షశాస్త్ర విభాగాధితపి ఆచార్య బి.సుజాత తదితరులు ప్రసంగిస్తారు. పోస్టర్ ఆవిష్కరణలో సదస్సు సహ కన్వీనర్ ఆచార్య ఎస్.బి పడాల్, సమన్వయకర్త డాక్టర్ జె.ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.