లబ్దిదారులందరికీ గడువులోగా పట్టాలు..
Ens Balu
1
Vizianagaram
2021-01-05 18:27:00
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం క్రింద మంజురైన లబ్దిదారులందరికి నిర్దేశిత గడువు లోగానే పట్టాల మంజూరు ఉత్తర్వులను అందజేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ స్పష్టం చేసారు. మంగళ వారం తాడేపల్లి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఎస్.పి లతో ఇళ్ళ పట్టాల పంపిణీ, ఉపాధిహామీ నిధులతో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులు, నాడు-నేడు, జతీయ రహదారులకు భూసేకరణ, అమ్మ ఒడి, వాహనాల ద్వారా రేషన్ సరకుల పంపిణీ తదితర అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారి చేసారు. ఇళ్ళ స్థలాల సమీక్ష లో భాగంగా జిల్లా వారీగా జరుగుతున్న పట్టాల పంపిణీ, టిడ్కో గృహాల పంపిణీ, పోసిషన్ సర్టిఫికెట్ల జారీ, కోర్ట్ కేసుల పరిష్కారం తదితర అంశాలలో ప్రగతి, ఓవరాల్ ప్రగతిని చదివి వినిపించి కలెక్టర్ల తో మాట్లాడించారు. విజయనగరం జిల్లా లో జగనన్న కాలనీల పంపిణీ లో 78.26 శాతం చేసి రాష్ట్రం లోనే ప్రధమంగా ఉన్నామని కలెక్టర్ వివరించారు. టిడ్కో గృహాల పంపిణీ లో 65 శాతం, పోసిషన్ సర్టిఫికెట్స్ లో 77 శాతం సాధించామన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి తొలుత జనవరి 7 ను గడువు తేదీ గా ప్రకటించగా వీడియో కాన్ఫరెన్స్ లో ఆ తేదీని ఈ నెల 20 వరకు పోడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ గడువు లోగా శత శాతం ఇళ్ళ పట్టాలు, గృహాల పంపిణీ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. జగనన్న కాలోనీలలో సామజిక వసతులను కల్పించి, మురికి వాడలు లేని కాలనీలను తీర్చి దిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆశయం మేరకు అన్ని రకాల వసతులను కల్పించి, మోడల్ హౌసింగ్ ను నిర్మించడానికి మనసు పెట్టి పని చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, జే. వెంకట రావు, సహాయ కలెక్టర్ సింహాచలం కట్టా, జిల్లా రెవిన్యూ అధికారి కే. గణపతి రావు, అదనపు ఎస్.పి శ్రీదేవి రావు, జిల్లా అధికారులు సి.పి.ఓ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ జే.డి ఆశదేవి, డి.ఈ.ఓ జి. నాగమణి, డి.ఎం.హెచ్.ఓ డా. రమణ కుమారి, పశు సంవర్ధక శాఖ జే.డి డా. నరసింహులు, డి.పి.ఓ సునీల్ రాజ్ కుమార్, డుమా పి.డి నాగేశ్వర రావు, బి.సి. కార్పోరేషన్ ఈ.డి నాగ రాణి , ఐ సి డి ఎస్ పి.డి రాజేశ్వరి, ఎస్.ఈ పంచాయతి రాజ్ గుప్తా తదితరులు హాజరైనారు.