సచివాలయాల అభివ్రుద్ధికి సలహాలివ్వండి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-05 20:58:39

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాలు పని తీరును మేరుగుపరచడానికి పలువురు కమిషనర్ల నుంచి సలహాలను ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళికా శాఖా ముఖ్య కార్యదర్శి వై. లక్ష్మి అడిగి తెలుసుకున్నారు. పట్టణాలలో సాంకేతిక పద్దతుల ద్వారా అమలు చేస్తున్న చెత్త నిర్వహణను, గృహ సముదాయాల నుండి చెత్తను వేరు చేసి సేకరించే విధానం గురుంచి, పట్టణంలో ఏర్పాటు చేయబోతున్న వై.ఎస్.ఆర్. ఆరోగ్య కేంద్రాల నిర్మాణపు పనులు పురోగతి, మున్సిపల్ స్కూళ్ళలో నాడు-నేడు పధకం క్రింద జరుగుతున్నా పలు అభివృద్ధి పనుల కోసం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అడిగితెలుసుకున్నారు. సి.డి.ఎం.ఏ. విజయ కుమార్ మాట్లాడుతూ పురపాలక సంఘాలు / కార్పోరేషన్లలో త్వరలో చేపట్టబోతున్న నూతన పన్ను సంస్కరణలు పైన, ఇళ్ళ స్థలాల పంపిణీ గూర్చి కమిషనర్లను ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పలు మున్సిపాలిటీలలో / కార్పోరేషన్లలో ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్య కార్యదర్శి దృష్టికి తేవాలని సి.డి.ఎం.ఏ. విజయ కుమార్ కమిషనర్లను కోరారు. విడియో కాన్ఫెరెన్స్ సమావేశంలో పాల్గొన్న జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన కార్పోరేషన్లో జరుగుచున్న పలు పనుల పురోగతిని వివరించారు. నగర పరిధిలో వార్డు సచివాలయాలు సక్రమంగా పనిచేస్తున్నాయని, ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్లాన్నింగ్, ఎమినిటీస్, శానిటరీ కార్యదర్శులకు పునశ్చరణ తరగతులు అందించాలని సూచించారు. నగరంలో హరిత-దనాన్ని పెంపొందించడానికి నక్షత్ర వనాలు, పంచతత్వ పార్కులు, మియావాకీ పార్కులు ఏర్పాటు చేయడం, 230 చెరువులును ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి చేపదుతున్నామని చెప్పారు. ఇంకా నగరంలో  ఏర్పాటు చేస్తున్న వై.ఎస్.ఆర్. క్లినిక్ లు, సాంకేతిక పద్దతిలో నిర్వహిస్తున్న చెత్త నిర్వహణ పైన, పాఠశాలలలో జరుచున్న నాడు – నేడు  పనులు పురోగతి గూర్చి తెలియపర్చారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ సమావేశంలో ముఖ్య కార్యదర్శి తో పాటు, సి.డి.ఎం.ఏ. విజయ కుమార్, ఇ.ఎన్.సి. చంద్రయ్య మొదలగు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొనగా జివిఎంసి నుండి కమిషనర్ డా. జి. సృజన తో పాటు అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి, పి.డి.(యు.సి.డి.) వై. శ్రీనివాసరావు, డి.సి.(ఆర్) రమేష్ కుమార్, ఏ.డి.హెచ్. ఎం. దామోదరరావు, పర్యవేక్షక ఇంజినీర్లు గణేష్, శ్యామ్సన్ రాజు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.