ప్రభుత్వ పథకాలను సద్వివినియోగం చేసుకోవాలి


Ens Balu
2
Arilova
2021-01-08 21:04:32

అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రభుత్వ పథకాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవడంతోపాటు అవగాహన పెంచుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు గొలగాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖలోని ఆరిలోవలోని అర్బన్1, సెక్టార్ 5 గాంధీనగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోందరన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అంగన్వాడీ కేంద్రాలను వినియోగించుకుని పిల్లలకు మంచి విద్యను చిన్నప్పటి నుంచి అందించడానికి తల్లులు చొరవ చూపాలన్నారు. ముఖ్యంగా అంగన్వాడీలంతా తమ తమ కేంద్రం పరిధిలోని వారందరికీ ప్రభుత్వ పథకాలు అందించి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలన్నారు. అంతేకాకుండా ఆరోగ్య సహాయకుల సేవలను కూడా అంగన్వాడీల ద్వారానే ప్రభుత్వం అందిస్తున్నందున, ప్రతీ బాలింత, గర్భిణీ ఖచ్చితంగా కేంద్రానికి వచ్చి అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో మహిళా సంరక్షణా కార్యదర్శిలు సికీర్తి, రేష్మా బేగం,భవానీ, అంగన్వాడీ కార్యకర్తలు శ్యామలాదేవి,రమానాగమణి, రమాదేవి తదితర సిబ్బంది పాల్గొన్నారు.