జగనన్న అమ్మవడి పండుగలా చేపట్టాలి..


Ens Balu
4
Chittoor
2021-01-08 21:03:50

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభి వృద్ధి లో భాగంగా ప్రతిష్టా త్మకంగా ఈ నెల 11 న 2వ విడత అమ్మఒడి కార్యక్ర మాన్ని పండుగ వాతావర ణం లో ప్రతి పాటశాల లో నిర్వహించాలని జిల్లా కలె క్టర్ డా.నారాయణ భరత్ గుప్త మండల విద్యా శాఖాధి కారులను, ప్రధానోపాధ్యా యులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయం లోని సమా వేశపు మందిరం లో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా మండల విద్యా శాఖాధికా రులు, ప్రధానోపాధ్యా యులతో నాడు-నేడు క్రింద పాటశాలలో జరుగుతున్న పనుల పై జిల్లా సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) వి.వీర బ్రహ్మo తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం విద్యా సంస్కరణ లో భాగంగా పిల్లల బంగారు భవిష్యత్తు బాటలు వేస్తూ తీసుకొనివచ్చిన అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరు జి ల్లా లో 2020 జనవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛ నం గా ప్రారంభించారని అర్హులైన తల్లుల ఖాతాల లోకి మొదటి విడత లో రూ.15 వేలు జమచేయడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న 2వ విడత అమ్మఒడి కార్యక్రమాన్ని అన్నీ పాటశాలలో పండుగ వాతావరణం లో నిర్వహిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అందరూ వీక్షించే లా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. చిత్తూరు కు సంబందించి నాగయ్య కళాక్షేత్రం లో ఈ కార్యక్రమా న్ని నిర్వహించడం జరుగు తుందని తెలిపారు. జగన న్న గోరుముద్ద, చదవడం నాకు ఇష్టం, జగనన్న విద్యా కానుక లాంటి కార్యక్రమాల ద్వారా విద్యా వ్యవస్థ లో పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనితో పాటు ప్రభుత్వ పాటశాలల రూపు రేఖలను మారుస్తూ తీసుకువచ్చిన నాడూ-నేడు కార్యక్రమంను రాష్ట్ర ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగు చున్నదని కార్పొరేట్ పాట శాలలకు దీటుగా ప్రభుత్వ పాటశాలలు సిద్దం అవుతు న్నాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాటశాలలో విద్యా ర్థుల నమోదు సంఖ్య పెరు గు తున్న నేపధ్యం లో ఉపా ధ్యాయుల పైనా మరింత బాద్యత ఏర్పడుతుందని, విద్యార్థులకు నైతిక విలువ ల తో కూడిన విద్యను అందించేoదుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చే యాలని ఈ దిశగా విద్యా శాఖ సన్నద్ధం కావాల న్నారు. జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు క్రింద ఎంపిక చేసిన పాటశా లలో జరుగుతున్న పనుల పురోగతిని వేగవంతం చే యాలని ఫిబ్రవరి 20, 2021 నాటికి అన్నీ పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావాలని ఆదేశించారు.మేజర్, మైనర్ రిపెర్ లలో భాగంగా నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్ల, త్రాగు నీటి వసతి, విద్యుధీకరణ పను లను ఈ నెల 11 నాటికి పూర్తి చేయాలని, పాటశాల పెయింటింగ్ పనులకి సం బందించి అవసరమైన మెటీ రీయల్ కొనుగోలు, చిత్రీక రించే చిత్రాలకు సంబందించి తుది నిర్ణయం తీసుకొని ఈ పెయింటింగ్ పనుల పర్య వేక్షణ బాద్యతలు డ్రాయింగ్ టీచర్ కి అప్పజెప్పాలని సూచించారు. నాబార్డ్ కింద చేసే పనులకు సంబందించి ఏ.ఈ లు ఎప్పటికప్పుడు చెక్ మెజర్మెంట్ ను అప్ లోడ్ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కొఆర్డినేటర్ వెంకటరమణ రెడ్డి, సెక్టోరియల్ అధికారు లు పాల్గొన్నారు.