జీవక్రాంతి పథకం లక్ష్యాలు పూర్తిచేయాలి..


Ens Balu
1
Srikakulam
2021-01-08 21:36:01

జగనన్న జీవక్రాంతి పథకం లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో  ఉన్నతి, అమూల్ పాల వెల్లువ కార్యక్రమాల ప్రగతిపై  జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్.సి., ఎస్.టి.లు, నిరుపేద వర్గాలకు అమలు చేస్తున్న ఉన్నతి కార్యక్రమంపై నిర్దేశిత ప్రణాళికలతో  లక్ష్యాలను   సాధించాలని తెలిపారు.  అమూల్ పాల వెల్లువ కార్యక్రమంలో  5 వేల  ఆవులు, గేదెల కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు.  లబ్దిదారుల ఎంపికను శని వారంలోగా పూర్తి చేయాలన్నారు.  లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగాను నిక్కచ్చిగాను చేయాలన్నారు. మంచి ఆరోగ్యంతో కూడిన పశువులను కొనుగోలు చేయాలని వాటికి ట్యాగ్ లు వేయాలని తెలిపారు. ఈ  సమావేశంలో సంయుక్త కలెక్టర్లు సుమీత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు,జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, పశు సంవర్ధక శాఖ సంయక్త సంచాలకులు వెంకటేశ్వర్లు, తదితరులు హాజరైనారు.