భూముల రీసర్వే సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
2
Amalapuram
2021-01-08 21:38:07

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు,భూ యజమానుల శాశ్వత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ ,గ్రామ  కంఠ స్థిరాస్తుల సమగ్ర రీ సర్వే కార్యక్రమాన్ని రైతులు,భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలియ చేసారు. శుక్రవారం అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మి గ్రామంలో  వై.ఎస్.ఆర్.జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం కింద డ్రోన్ ద్వారా చేపట్టిన సమగ్ర రీ సర్వే కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద సంవత్సరాల తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ను,పారదర్శకంగాను చేపట్టిన ఈ సమగ్ర రీ సర్వే కార్యక్రమానికి రైతులు వారి సరిహద్దులు,హక్కు పత్రాలు సర్వే బృందానికి చూపించాలని,సర్వే పూర్తి అయ్యాక ప్రతి భూ యజమానికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వడం జరుగుతుందని సబ్ కలెక్టర్ అన్నారు.అలాగే ఈ సమగ్ర రీ సర్వే ద్వారా రైతులు,భూ యజమానులకు సంభందించిన భూములకు రక్షణ కల్పించడమే కాకుండా ఆ భూముల పై వారికి శాశ్వత హక్కు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే సత్తి నాగేశ్వరరావు, కె.ఆర్.సి. తహశీల్దార్ సీత,డిప్యూటీ తహశీల్దార్ అశోక్,గ్రామ సర్వేయర్లు,మరియు డ్రోన్ సిబ్బంది పాల్గొన్నారు.