పన్నుల పెంపుపై 19న సమావేశం..


Ens Balu
2
Srikakulam
2021-01-08 21:40:58

పన్నుల పెంపుదల పై 19తేదీ న సమావేశాన్ని నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్ద కమీషనర్ పల్లి నల్లనయ్య శుక్రవారం తెలిపారు.  నగరపాలక సంస్ద పరిధిలో ప్రదర్మన సామాగ్రి,ప్రచార పరికరాలు,ప్రకటన పన్నుల పెంపుదలకు, సంబందిత అధికారుల యొక్క సలహాలు, సూచనలు తెలుపుటకు మధ్యాహ్నం ౩ గం.లకు నగరపాలక సంస్ద సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.    భూమి మీద ఇండ్లు,భవనములు,గోడల మీద దీపాలకరణ లేని స్దంబము కట్టడములు, ప్రేమ్ బోర్డు ప్రకటనలు  గతంలో రూ.180 ఉండేదని ఇప్పుడు రూ. 540 పెంపుదలకు ప్రతిపాదించడం జరిగిందన్నారు.భూమి మీద ఇండ్లు,భవనములు,గోడల మీద, స్దంబముల మీద, కట్టడములు మీద ,ప్రేముల పైనను,బోర్డుల మీదను దీపాలంకరణ గల ప్రకటనలకు గతంలో రూ.450 ఉండేదని  ఇప్పుడు రూ.1350 పెంపుదలకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఎడ్లు,గుర్రములు,ఇతర జంతువులు,మనుషులతో  లాగుబడు రవాణా వాహనములు,బస్సులు,ప్రకటన వ్యాన్,ఆటోల  వాహనముల పై దీపాలంకరణ లేని ప్రకట నలకు రూ.900 నుండి రూ.2700 లకు ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు.వాహనాల పై దీపాలంకరణ గల ప్రకటనలకు రూ.1800 నుండి రూ.5400 లకు, ఇరువైపుల మనుష్యులు బండి  మోయబడు దీపాలంకరణ కాని ప్రకటనలకు రూ.270 నుండి రూ.810 లకు, దీపాలంకరణ గల మనుష్యులు మోయబడు బండి రూ.360 నుండి రూ.1080  పెంపుదల ప్రతిపాదించడం జరిగిందన్నారు. పబ్లిక్ ప్రదేశాలలొ లాంతర్లు,స్లైడులు ద్వారా గాని ఆమోదిత ఇతర సాధనముల ద్వారా ప్రజలకు తెర పై ప్రదర్మింపబడు ప్రకటనలకు రూ. 720 నుండి రూ. 2160 లకు , సినిమా దియోటర్లలో ప్రకటనలకు రూ. 540 నుండి రూ. 1620 పెంపుదలకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. వీధులకు అడ్డంగా పైన  వేలాడదీయు దీపాలంకరణ కాని ప్రకటనలకు రూ. 180 నుండి రూ.540 లకు, అడ్వర్టైజర్  పేరు  కలిగిన లేదా  అద్దెకు ఇవ్వబడును అని ప్రకటన వ్రాసిన దీపాలంకరణ లేని బోర్డులకు రూ.90 నుండి రూ.270 లకు, యుని పోల్ , ఒక స్దంబం పై ప్రకటన చేయుటకు  2.50 చ.మీ. ఒక్కింటికి రూ.2500 పెంపుదల ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. అచ్చు వేయబడు ప్రకటన ప్రదర్మించుటకు రూ.720 నుండి రూ.2160 పెంచడానికి, గాలిలో తేలియాడే బెలూన్ ప్రకటనలకు రూ.5000, రిజిస్ట్రేషన్, క్రమబద్దీకరణకు ఒక్కసారి మాత్రమే చెల్లించవలసిన రుసుము ప్రస్తుతము  వున్న ప్రతి ప్రదర్మన  సామాగ్రి ప్రకటనలకు రుసుము ప్రతిపాదించడంజరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సంబందిత అధికారులు సమావేశానికి హాజరై తగు సలహాలు,సూచనలు ఇవ్వవలసిందిగా కమీషనర్ కోరారు.