రెవిన్యూ అధికారుల సేవలు అభినందనీయం..


Ens Balu
3
Anantapur
2021-01-08 22:00:08

నవరత్నాలు - పేదలందరికి ఇల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కష్టపడి పని చేసిన రెవెన్యూ యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని కృష్ణ కళామందిర్ లో నవరత్నాలు - పేదలందరికి ఇల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయుటలో భాగస్వాములైన రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 2వ స్థానంలో నిలిచిందని, ఇందుకోసం ఎంతగానో కృషి చేసిన రెవెన్యూ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటి పట్టాల పంపిణీ లో మాత్రమే కాకుండా కోవిడ్, ఇతర యాక్టివిటీ లలో కూడా రెవెన్యూ శాఖ సిబ్బంది గొప్పగా పని చేశారన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున లేఔట్లను సిద్ధం చేసి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెవెన్యూ యంత్రాంగానికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికి ఇల్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రెవెన్యూ యంత్రాంగం చాలా కష్టపడి పనిచేయడం జరిగిందని, అందువల్లే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని, ప్రతి ఒక్క అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, సబ్ కలెక్టర్ నిషా0తి, డిఆర్ఓ గాయత్రి దేవి, డిప్యూటీ కలెక్టర్ లు, ఆర్డీఓ లు, తహశీల్దార్ లు, డిప్యూటీ తహశీల్దార్ లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.