వాసుపల్లీ.. రాజీనామా చేసి గెలిచి చూపించు..
Ens Balu
3
Visakhapatnam
2021-01-08 22:03:34
విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లికి దమ్ము,ధైర్యం ఉంటె రాజీనామా చేసి గెలవాలని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్ సవాలు విసిరారు.శుక్రవారం జిల్లా కార్యాలయంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం శాసనసభ్యునిగా గెలిచి వైసీపీ కండువా కప్పుకోకుండా తన భజనపరులకు వైసీపీ కండువాలు కప్పడం హస్స్యాస్పదంగా ఉందన్నారు.ఈ రోజు వాసుపల్లి కండువాలు కప్పినవారందరూ అయన భజనపరులేనన్నారు.తెలుగుదేశం దయవల్ల రెండుసార్లు శాసనసభ్యునిగా గెలిచి సొంతబలమని విర్రవీగుతున్నారని దుయ్యబట్టారు.సంస్కరహీనంగా మాట్లాడటం విద్యాధికునిగా ఆయనకు చెల్లదని హితవు పలికారు.తెలుగుదేశం కార్యకర్తల బలమేమిటో ఆయనకు బాగా తెలుసన్నారు.ప్రస్తుతం వాసుపల్లి వాలకం చూస్తుంటే మతిభ్రమిచిందేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు.ఏ1,ఏ2, ల పార్టీ లో చేరిన తరువాత గతం మరిచి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
వ్యక్తిగత స్వార్ధం తో వైసీపీ పంచన చేరారన్నారు.రాబోయే కార్పొరేషన్ ఎన్నికలల్లో మేయర్ పీఠం తెలుగుదేశందేనని ఘంటాపధంగా చెప్పారు.సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో దాదాపు ఇరవై ఏడు సీట్లు గెలుచుకుంటామన్నారు.ఇళ్ల పట్టాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.దేవాలయ సంఘటనలపై మంత్రులు అసభ్యంగా మాటాడుతున్నారని,రాష్ట్రానికి శనిలా దాపురించారని విమర్శించారు.శాసనసభ్యునిగా రాజీనామా చేసి తన బలమేమిటో వాసుపల్లి తెలుసుకోవాలని మరొక్కసారి హితవుపలికారు.దక్షిణ నియోజకవర్గ వార్డు ఇంచార్జులు,కార్పొరేటర్ అభ్యర్థులు పత్రికా సమావేశంలో పాల్గొని వాసుపల్లి అసభ్యకర ప్రకటనలపై దుమ్మెత్తిపోశారు.ఈ కార్యక్రమంలో విల్లురి చక్రవర్తి,చిన్నరహ్మన్,దాసన త్యనారాయణ,ఎల్లపుశ్రీనివాసు,పొడుగుకుమార్, సత్యవతి,బొత్సరాము, రామానంద్,సీఎం రమణ,జగదీశ్,కనగళ్లసత్య.బాపుఆనంద్. కోడిగుడ్లశ్రీధర్,ఈమంది రంగారావు,లక్ష్మీ శివప్రసాద్.తదితరులు పాల్గొన్నారు.