తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి..
Ens Balu
5
Kurnool
2021-01-08 22:15:26
కర్నూలు నగర పాలక పరిధిలో వివిధ టెలికామ్ రంగ సంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లను ఇష్టరీతిన ధ్వంసం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ హెచ్చరించారు. నగరంలో చాలా చోట్ల అనుమతులు లేకుండా రహదారులు తవ్వినప్పుడు భూమి లోపల ఉండే తాగునీటి పైప్ లైన్ ధ్వంసం అయి ప్రధాన పైప్ లైన్ మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు వివిధ ప్రాంతాల్లో మునిసిపల్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై నగర పాలక పరిధిలో టెలికామ్, కేబుల్ రంగ యాజమాన్యం వారు తమ వైరింగ్ పనులు చేపట్టే ముందు తప్పకుండా కర్నూలు మునిసిపల్ కొర్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోని తిరిగి పనులు పూర్తయ్యాక వాటిని పూడ్చివేయాలని కోరారు. నగర ప్రజలు కూడా ఇలాంటి పనులు ఎవరైనా చేపడుతునట్లు గుర్తిస్తే వెంటనే నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 7422992299 కు ఫోన్ ద్వారా కానీ...వాట్సాప్ లో మెసేజ్ రూపం గాని మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని కోరారు.