పైలట్ గ్రామాలుగా తమటాడ, మర్రివలస..
Ens Balu
1
Vizianagaram
2021-01-08 22:24:24
సర్వే అఫ్ విలేజెస్ అండ్ మాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్( స్వమిత్వ ) పధకం క్రింద సమగ్రంగా సర్వే జరపాలని సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవం సందర్భంగా 2020 ఏప్రిల్ 24 న ప్రధాన మంత్రి ప్రారంభించిన స్వమిత్వ పధకం ద్వార గ్రామాలలోనున్న ఆస్తి హక్కు దారులకు రికార్డుల పై హక్కులను కల్పించడం జరుగుతుందని అన్నారు. హక్కుదారులు వారి ఆస్తుల పై బ్యాంకు ల నుండి రుణాలు పొందడానికి వీలయ్యే అంత శుద్ధంగా రికార్డు లు ఉండాలని ఉద్దేశించే ఈ సర్వే కోసం పైలట్ గ్రామాలుగా రెండు డివిజిన్ల నుండి రెండు గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. బొండపల్లి మండలం తమటాడ , రామభద్ర పురం మండలం మర్రివలస గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి చేయాలని అన్నారు.
శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశ మందిరం లో సర్వే కార్యక్రమం పై రెండు మండలాలకు చెందిన రెవిన్యూ, పంచాయతి రాజ్, సర్వే శాఖల అధికారు లు, సిబ్బంది తో సమావేశం ఏర్పాటు చేసారు. గ్రామం లోని ప్రతి ఇంటికి కొలతలు వేసి, హద్దు లను నిర్ధారించాలన్నారు. అదేవిధంగా ఖాళీ స్థలాలను, ప్రభుత్వ స్థలాలను, గ్రామకంఠం ను కూడా కొలతలు వేసి పొడవు, వెడల్పులను, సరి హద్దులను గుర్తించి హద్దు రాళ్ళను పాతాలని సూచించారు.డ్రోన్ ద్వారా ఫోటో లను తీయడం జరుగుతుందని, అందుకు అడ్డంగా ఉండే చెట్ల కొమ్మలను ఇతర సామగ్రిని తొలగించాలన్నారు. ఈపధకం ద్వారా గ్రామా స్థాయి రెవిన్యూ రికార్డులన్నీ సమగ్రంగా శుద్ధం అవుతాయని తెలిపారు. మాస్టర్ ట్రైనీ లతో సర్వేయర్స్ కు, సచివాలయ కార్యదర్సులకు సర్వే అంశాల పై పూర్తి స్థాయి శిక్షణ త్వరగా ఇవ్వాలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా పచయతి అధికారి సునీల్ రాజ్ కుమార్, సర్వే సహాయ సంచాలకులు పోలా రాజు, డివిజినల్ పంచాయతి అధికారి మోహన రావు , బొండపల్లి, రామభద్రాపురం మండలాల ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, సర్వేయర్లు , ఈ ఓ పి ఆర్ డి లు పాల్గొన్నారు.