బలవంతపు ఫీజుల వసూలు ఆపాలి..


Ens Balu
3
Visakhapatnam
2021-01-09 16:16:42

విశాఖజిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి బలవంతపు ఫీజు వసూలు వెంటనే ఆపాలని డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు యుఎస్ఎన్ రాజు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బలవంతంగా  ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కరోనా కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారి నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఒకవేళ ఏ విద్యా సంస్థ అయినా ఆ రకంగా ఫీజు అడిగితే తమకు వెంటనే తెలియజేయాలని ఆయన కోరారు. ఫిర్యాదు చేయడానికి విద్యార్ధులు, విద్యార్ధలు తల్లి దండ్రులు ఈ నెంబర్లలో సంప్రదించాలన్నారు.  9490944049, 88864 01852.