అన్ని మతాల వారు సోదర భావం తో మెలగాలి..


Ens Balu
2
Chittoor
2021-01-09 19:18:29

అన్ని మతాల వారు సోదర భావం తో మెలిగే ఘనమైన సం స్కృతి మన దేశ ప్రత్యేకత దీన్ని మనమందరం కలసి కాపాడుకుందాం అని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జిల్లా సచివాలయంలో ని సమావేశ మందిరంలో జిల్లాలో మత సామరస్యంను పెంపొందించడం అనే అంశం పై జిల్లాలోని అన్ని మతాలకు చెందిన మత పెద్దలతో జిల్లా కలెక్టర్, తిరుపతి ,చిత్తూరు ఎస్.పి లు రమేష్ రెడ్డి,సెంథిల్ కుమార్ లతో కలసి సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి ఏ.ఎస్.పి లు మహేశ్, ఆరిఫుల్లా, జిల్లా సంయుక్త కలెక్టర్ (సంక్షేమం ) రాజశేఖర్, డి‌ఆర్‌ఓ మురళి, శ్రీకాళహస్తి ఈ.ఓ పెద్దిరాజు, వివిధ సంబందిత శాఖల అధికారులు, మతపెద్దలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యం ను పెంపొందించుటకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మత సామరస్య పరిరక్షణ కమిటీలు (COMMUNAL HARMONY COMMITTEES) ఏర్పాటులో భాగంగా జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా, ఎస్.పి వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తూ వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు ఒక్కొక్కరు చొప్పున దేవాదాయ, మైనారిటీ శాఖలకు చెందిన అధికారులు కమిటీ గా ఏర్పాటై ఈ కమిటీకి కన్వీనర్ గా జిల్లా సంయుక్త కలెక్టర్(రెవెన్యూ) వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాకు శాంతి భద్రతల పర౦గా మంచి పేరు ఉన్నదని మన జిల్లా శాంతి భధ్రతల విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచేలా అందరూ కలసి కట్టుగా ఉందామన్నారు. అన్ని మతాల వారు సోదర భావంతో మెలిగే ఘనమైన సంస్కృతి మన దేశ ప్రత్యేకత అని దీన్ని మమమందరం కలసి కాపాడుకుందాం అని తెలిపారు. చిత్తూరు ఎస్.పి మాట్లాడు తూ మత సామరస్య పరి రక్షణ కమిటీలు జిల్లా స్థాయి లో నే కాక మండల, పంచా యతీ, గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు ద్వారా సత్ఫలితాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ప్రార్థనా స్థలాల వద్ద కచ్చితంగా సి.సి కేమరాలను ఏర్పాటుకు కమిటీలు చర్యలు చేపట్టా లని కోరారు. పోలీస్ శాఖ వారు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అన్ని ప్రార్థనా స్థలాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి నిఘాను ఏర్పాటు చేయదమైనదని తెలిపారు. తిరుపతి అర్బన్ ఎస్.పి మాట్లాడుతూ మత సామ రస్యంను పెంపొందించే అంశంలో చిత్తూరు జిల్లా అందరికీ మార్గ దర్శకంగా నిలిచేలా ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించా లని కోరారు. కరోనా విప త్కర సమయంలో ప్రజలం దరూ సమిష్టిగా జిల్లా యంత్రాoగంనకు సహకరిం చడం జరిగిందని ఆ ఐకమ త్యమే మత సామరస్యం ను పెంపొందించుటలో కూడా ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలన్నారు. ఈ సమావేశంలోభాగంగా మత పెద్దల నుండి మత సామరస్యం పెంపునకు తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు...