ఉత్తరంలో ప్రజాసంకల్పయాత్ర సంబురాలు..


Ens Balu
2
Visakhapatnam
2021-01-09 19:37:13

సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర  విజయవంతంగా పూర్తయి శనివారం నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె కె రాజు  ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కె కె కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కె కె రాజు  మాట్లాడుతూ, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మన  వై ఎస్  జగన్మోహన్ రెడ్డి  ప్రజా సమస్యలను ప్రజలు వద్దకు వెళ్లి తెలుసుకోవడానికి పాద యాత్ర చేపట్టారన్నారు. ఆ తరువాత ప్రజలకు అండగా ఉండేందుకు చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రతో  సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి గా వారికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజల సమస్యలను ఇంటి ముంగిటే పరిష్కరించేందుకు గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.. ఈ కార్యక్రమంలో వార్డు  అభ్యర్థులు, వార్డు అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు  తదితరులు పాల్గొన్నారు.