హిందీని అధికార భాషగా గుర్తించాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-01-10 18:31:07

ప్రపంచంలో అతిపెద్ద మూడవ భాష అయిన హిందీని ఐక్య రాజ్య సమితి అధికార భాషగా గుర్తించాలని హిందీ మంచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యాయ సంఘ నేత ఎం. నీలాద్రిరావు డిమాండ్ చేశారు. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ మంచ్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన హిందీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంచ్ జిల్లాశాఖ అధ్యక్షులు ఉప్పులూరి లక్ష్మణరావు మాట్లాడుతూ,  2006 నుంచి జనవరి 10 న అంతర్జాతీయ హిందీ దినోత్సవం జరిపే సంప్రదాయం ప్రారంభమైందన్నారు. 45 సంవత్సరాలుగా వెలువడుతున్న హిందీ ప్రచార సభ హైదరాబాద్ మాస పత్రిక ప్రత్యేక సంచికలను సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం హిందీ ప్రచారానికి కృషి చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయ సంఘ నేత ఎం. నీలాద్రిరావు ను సభ్యులు సత్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వాడాడ సన్యాసిరావు, కార్యవర్గ సభ్యులు దేవగుప్తపు సుందరి, పి.శాస్త్రి, కె. నవీన్ కుమార్ , షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు.