మత సామరస్యాన్ని పెంపొందించాలి..


Ens Balu
4
Visakhapatnam
2021-01-10 19:52:03

మత సామరస్యానికి భంగం కలిగిస్తే కమిటీ తగు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు.  ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతతకు సంబంధించి ఆత్మగౌరవంతో గత స్మృతుల వైపుగా ఎ్వరైనా చూడవచ్చునని, జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ సమానత్వాన్ని కాపాడుకునేందుకు అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.  అన్ని కులాలు, మతాల ప్రజలు నుండి శాంతియుత సహజీవనంలో ఉన్నట్లు చెప్పారు.  శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  ఇందులో జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గాను, నగర పోలీసు కమీషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఉపాధ్యక్షులుగాను, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్, మైనార్టీ సంక్షేమాధికారులు సభ్యులు గాను, జిల్లా జాయింట్ కలెక్టర్ సభ్యులు/కన్వీనర్ గా ఉంటారని తెలిపారు.  ఏడు మతాలకు సంబంధించి పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు.  జిల్లాలో ఎక్కడైనా మతాలకు సంబంధించిన గొడవలు ఉంటే, శాంతి భద్రద్రతలకు విఘాతం కలిగితే ఈ కమిటీ తగు చర్యలు తీసుకుంటుందన్నారు.  ఈ కమిటీ ద్వారా జిల్లా ప్రజలకు ఒక సందేశం వెలుతుందని చెప్పారు.  జిల్లాలోని 15 శాసన సభ నియోజక వర్గాలు ఉండగా ఇందులో 7 పట్టణ పరిధిలోను, 8 గ్రామీణంలో ఉన్నట్లు వెల్లడించారు.  నియోజక వర్గాల వారీగ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు.  ప్రభుత్వం వ్యక్తులు, కులం, మతం లేదా రాజకీయ సంబంధాలతో పనిలేకుండా ఒక పారదర్శకమైన, లక్ష్యపూరిత రీతిలో ప్రయోజనాత్మక గుర్తింపు చోటుచేసుకునేటట్లు చూస్తోందని, అన్ని కార్యక్రమాలను సంతృప్తి ప్రాతిపదికన అమలు చేయాలన్న ప్రభుత్వ ధృడ నిశ్చయంతో ఉందన్నారు.  ప్రభుత్వం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు మహిళా సాధికార రంగాలలో ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు.     జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీ.. మత సామరస్యానికి భంగం కలిగించడానికి వీలుండే విధంగా జిల్లాలో ఏవేని సంఘటనలు చోటుచేసుకున్న సందర్భంలో కమిటీ సమావేశమై మత, శాంతి సామరస్యాన్ని పునరుద్ధరించే రీతిలో సకాలంలో సముచిత చర్యను చేపట్టేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని వర్గాలు కలసికట్టుగా ఉన్నాయని, జిల్లా అభివృద్థికి కృషి చేస్తున్నాయనే గట్టి సందేశాన్ని పంపే విధంగా కార్యకలాపాలను చేపట్టాలని, పై లక్ష్యాన్ని సాధించడానికి శాసన సభ నియోజక వర్గం స్థాయిలో కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలను కూడా నిర్వహిస్తుందన్నారు.  శాసన సభ నియోజక వర్గం లో సామాజిక, మత సంబంధ ఆధారంగా కమిటీ సభ్యులను ఎంచుకుంటుందని వివరించారు.     గతంలో చోటుచేసుకున్న వివాదాలు/సంఘర్షణలను పరిగణనలోకి తీసుకొంటూ, అదే తరహా కేసులతో వ్యవహరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు.  సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల జాబితాను తయారు చేసి అట్టి ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షించడం జరుగుతుదన్నారు.  భూ వివాదాలు లేదా ఇతర అంశాలను పరిష్కరించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.   జిల్లాలలోని అన్ని మత సంబంధ భవనాలు, కట్టడాలు, స్మారక చిహ్నల కోసం భద్రతా ప్రణాళికను తయారు చేయడం, ఆమోదించడం, అమలు పరచడం జరుగుతుందన్నారు.  సామాజిక సభ్యులలో విశ్వాసాన్ని పెంపొందించడానికై జిల్లా స్థాయి కమిటీలు తరచుగా క్షేత్ర స్థాయి సందర్శనలు చేపట్టడం, మత సామరస్యానికి భంగం కలిగించిన నిందితులపై ఐపిసిలోని వివిధ సెక్షన్ల క్రింద నమోదు చేసిన కేసులను సమీక్షించడం జరుగుతుందన్నారు.     అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధ్యక్షతన కమిటీ సమావేశమయింది.  వివిధ మతాలకు సంబంధించిన పెద్దలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు.  జిల్లాలో మతాలు, కులాలు బేధాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతోందన్నారు.  శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఈ కమిటీ చూసుకుంటోందని, ఏ ప్రాంతాలలోను గొడవలు జరగకుండా ముందుగానే ఒక ప్రణాళికను తయారు చేసుకుంటుందని వివరించారు.  నగర పోలీసు కమీషనర్ మనీస్ కుమార్ సిన్హా, ఎస్.పి. బి. కృష్ణారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.     ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, కమిటీ సభ్యులు ముస్లీం మత పెద్ద అబిజిత్ మద్రాస్వల, జైన్ల నుండి ప్రియాంక బన్సలి జైన్, బుద్దిస్టు యడ్ల నౌకొ సింహాద్రి, క్రిస్టియన్ ల నుండి జోషఫ్ జయకుమార్, మార్వాడి నుండి సునిల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.