కోవిడ్-19 వాక్సినేషన్ కు ఏర్పాట్లుచేయాలి..


Ens Balu
8
Visakhapatnam
2021-01-10 20:30:37

జిల్లాలో కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియకు మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్ , ఆర్డిఓలు సిద్దంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్దంచేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వాక్సినేషన్ పై ఐటిడిఎ పిఓ, నర్సీపట్నం సబ్ కలెక్టర్, జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులతోను, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 వాక్సినేషన్ కు అత్యంత సమర్థవంతంగా ఏర్పాట్లను గావించాలన్నారు.  మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లైన ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఎఎన్ఎంలు, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఎక్స్ టెన్షన్ అధికారులు, ఫార్మాసిస్టులు, నర్సులు, హెల్త్ అసిస్టెంటులు, పరిపాలనా సిబ్బంది, పారిశుద్య కార్మికులు, ఆంబులెన్స్ డ్రైవర్లు, మొదలగు ఆసుపత్రులలో పనిచేయు ప్రతి ఉద్యోగికి మొదటి దశలోనే వ్యాక్సినేషన్ గావించడం జరగాలన్నారు.      రెండవ దశలో రెవెన్యూ, పంచాయితీరాజ్, పోలీసు శాఖ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు వాక్సినేషన్ గావించడం జరుగుతుందని పేర్కొన్నారు.  మొదటి దశ మరియు 2వ దశలలో వాక్సినేషన్ గావించు సిబ్బంది పేర్లు, వివరాలకు సంబంధించిన డాటా ఎంట్రీ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.  ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పారు.   వాక్సినేషన్ ప్రక్రియకు సిబ్బంది అందరిని మరియు సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు.  వాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుసుకోవాని చెప్పారు.  ప్రతి వాక్సినేషన్ సెట్ కు, దగ్గరలోని పిహెచ్ సి, ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ గా గుర్తించాలన్నారు.  ఆంబులెన్స్ ను సిద్దంగా ఉంచాలని చెప్పారు.     ఈ సమావేశంలో జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, డిఆర్ఒ ఎ. ప్రసాద్, ఆర్డిఓ పెంచల కిషోర్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్, జిల్లా పంచాయితీ అధికారి కృష్ణకుమారి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ దవళ భాస్కరరావు మరియు వీడియో కాన్ఫరెన్స ద్వారా ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, అనకాపల్లి, పాడేరు ఆర్డిఓలు సీతారామారావు, శివజ్యోతి, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.