విజయనగరంలో 954 మందికి వ్యాక్సిన్..
Ens Balu
1
Vizianagaram
2021-01-16 20:40:35
విజయనగరం జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజైన శనివారం 954 మంది వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కరోనా టీకాలు వేయించుకున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి తెలిపారు. జిల్లాలో 1441 మంది తొలిరోజు టీకా వేయించుకొనేందుకు కోవిన్ యాప్‌లో నమోదు చేసుకోగా వారిలో 1057 మంది టీకాల కార్యక్రమానికి హాజరయ్యారని, 954 మంది టీకాలు వేయించుకున్నట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఇద్దరు మాత్రమే స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అది కూడా చిన్నపాటి అనారోగ్యం మాత్రమేనని తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గం జగన్నాధపురం పి.హెచ్.సి.లో ఒకరు, ఎస్.కోటలో ఒకరు మాత్రమే కొద్దిపాటి అనారోగ్యానికి గురై వెంటనే వైద్యుల చికిత్సతో కోలుకున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు.