లబ్ధిదారుల ఎంపిక సత్వరమే పూర్తిచేయండి..


Ens Balu
2
Kakinada
2021-01-16 21:08:41

ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ లో భాగంగా మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తక్షణమే పూర్తిచేయాలని  జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ)  డా.జి. లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు.    శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జేసి లక్ష్మీశ, జేసి (అభివృద్ధి) కీర్తి చేకూరి తో కలిసి సివిల్ సప్లయి, ఎస్సీ ,బీసీ ,మైనార్టీ కార్పొరేషన్ల అధికారులతో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లకు లబ్ధిదారులు ఎంపిక, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక, డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. దీనికి సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ తక్షణమే పూర్తిచేయాలని ఆయన తెలిపారు. మొత్తం 1076 మంది లబ్ధిదారులకు మొబైల్ డిస్పెన్సరీ వాహనాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరలోనే రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది అన్నారు.లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అధికారులు,బ్యాంకు ప్రతినిధులు అందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని జేసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయిస్ డీయం ఇ.లక్ష్మీ రెడ్డి,బిసి, మైనారిటీ కార్పొరేషన్ అధికారులు ఎస్ వి ఎస్.సుబ్బలక్ష్మీ, పి ఎస్.ప్రభాకర్ రావు, టాటా, సుజుకి వాహనాల కంపెనీ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.