మహిళా సాధికారత కనిపిస్తోంది..
Ens Balu
3
Chittoor
2021-01-16 21:21:09
మహిళా సాధికారత కనిపిస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ ప్రతాప్ రావు జాధవ్ పేర్కొన్నారు. శనివారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా పులిచెర్ల మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం కల్లూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు స్వయం సహాయక సంఘాల మహిళలతో ఏర్పాటైన సమావేశంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గౌ.ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, గౌ.సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, గౌ.షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులు సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహిళలను ఉద్దేశించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గౌ.చైర్ పర్సన్ మాట్లాడుతూ ఒక్కప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితమయ్యే వారని, ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని పేదరిక నిర్మూలన కొరకు అమలుచేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటున్నారని మహిళా సాధికారత కనిపిస్తున్నదని తెలిపారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మరియు జమ్మూ కాశ్మీర్ ఎం.పి గౌ.నజీర్ అహ్మద్ లవాయ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పధకాలైన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ బాగున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాల పై ప్రత్యేక దృష్టి సారించి అమలు చేస్తుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలుగా ముస్లిం మహిళలు కూడా ఉంటూ ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు తోడ్పడుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
రాజంపేట ఎం.పి.మిధున్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు రావడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేస్తుందని పధకాలన్నింటిని మహిళల పేరు మీదనే అందిస్తూ మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నదని, మధ్యపాన నిషేదాన్ని దశల వారిగా అమలు చేస్తూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుందన్నారు.
ఈ సమావేశంలో స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన కావేటి గారి పల్లికి చెందిన రెడ్డమ్మ సంఘం ద్వారా తాను ఆర్ధికంగా అభివృద్ది చెందిన విధానం గురించి కమిటీ కి వివరిస్తూ తాను 2007 లో సంఘంలో సభ్యురాలిగా చేరడం జరిగిందని, సంఘం పేరు రాఘవేంద్ర సంఘం అని సంఘంలో చేరక మునుపు కూలీ పనులకు వెళ్ళే వారమని సంఘంలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు విడతల వారీగా దాదాపు 20 లక్షల రూపాయలు రుణం తీసుకొని ఆర్ధికంగా తన కుటుంబాన్ని అభివృద్ది చేసుకునేందుకు వినియోగించుకోవడం జరిగిందని, ఉన్న ఒక ఎకరా పొలంలో వరి, వేరు శెనగ పంటలు పండించడం జరిగిందని, సంఘం అండదండలతో మరియు లోన్ సహాయంతో ట్రాక్టర్ ను కొనుగోలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే పధకాలైన అమ్మ ఒడి, వై.ఎస్.ఆర్ ఆసరా, సున్నా వడ్డీల కింద తాను లబ్ది పొందానని తాను సంఘంలో సభ్యురాలిగా ఉండడం వలనే ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు అవకాశం ఏర్పడిందని సంతోషంతో హింది బాషలో అనర్హళoగా కమిటీ సభ్యులకు వివరించింది.
కల్లూరు కు చెందిన మరో సభ్యురాలైన షహీన ప్రభుత్వ పధకాల ద్వారా పొందిన లబ్దిని వివరిస్తూ తనకు గల ఎకరా భూమిలో ఉపాధి హామీ పధకం కింద మామిడి చెట్లను పెంచుతున్నామని తన పొలంలో తాను పని చేస్తూ ఉపాధి పొందుతున్నానని అందుకు వేతనంగా రోజుకు రూ.200 అందుతుందని రైతు భరోసా పధకం, కిసాన్ యోజన పధకాల కింద అందిన ఆర్ధిక సాయంను మామిడి తోట అభివృద్దికి వినియోగించుకోవడం జరిగిందని, ఈ వచ్చే ఆదాయంతో నా కొడుకును బి.టెక్ చదివిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన లబ్దిదారులందరికి చేరుతున్నాయన్నారు.
కల్లూరు జిల్లా ఉన్నత పాఠశాలకు చెందిన విధ్యార్ధి భవ్య గత 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పధకాలైన నవరత్నాలు, వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఉచిత విధ్యుత్, వై.ఎస్.ఆర్. ఆరోగ్య శ్రీ, దశల వారీగా మధ్యపాన నిషేధం, అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న తోడు, జగనన్న విధ్య దీవెన, వసతి దీవెన పధకాల గురించి సవివరంగా వివరించి అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, డ్వామా, డి.ఆర్.డి.ఏ పి.డి లు చంద్రశేఖర్, తులసి, డి.పి.ఓ దశదరామిరెడ్డి, ఇండియన్ బ్యాంక్ జెనరల్ మేనేజర్ ఏ.కె మహాపాత్రా, యూనియన్ బ్యాంక్ జి.ఎం.లాల్ సింగ్, ఎల్.డి.ఎం గణపతి, ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపిడిఓ దేవేంద్ర బాబు, ఎంఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.