నరేగా పనులు ప్రజలకు ఉపాది పెంచాలి..


Ens Balu
7
Pulicherla
2021-01-16 21:29:53

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిల్లా పర్యటనలో భాగం గా పులిచర్ల మండలం సువ్వారపు వారి పల్లిలో ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద చేపట్టిన హార్టికల్చర్ ప్లానిటేషన్(మామిడి తోట) ను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్  ప్రతాప్ రావు జాధవ్ అద్యక్షతన గల కమిటీ లో సభ్యులుగా గౌ.తలారి రంగయ్య ఎం.పి అనంతపురం, సుజిత్ కుమార్ ఎం.పి ఒడిస్సా, షంషీర్ సింగ్ డుల్లో ఎం.పి పంజాబ్, గౌ.నజీర్ అహ్మద్ లవాయ్,ఎం.పి జమ్ము కాశ్మీర్ సభ్యులతో గల కమిటీ  పరిశీలించింది.. అనంతరం మతుకు వారిపల్లి లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను కమిటీ పరిశీలిం చింది. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న 16 రకాల సేవలైన పి‌ఎం- కిసాన్ -వై.ఎస్.ఆర్ రైతు భరోసా, ఈ-క్రాప్ బుకింగ్, డి-కృషి (సీడ్-డిస్ట్రిబ్యూషన్), సి‌ఎం యాప్, వై.ఎస్.ఆర్ యాప్, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలం బడి, క్రాప్ ఇన్సూరెన్స్ , జె.ఎల్.జి గ్రూప్స్, అగ్రో అడ్వైజరి బోర్డ్ ల గురించి మరియు రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సలహాలు, సూచనలకు సంబందించిన అంశాలన్నింటిపై రాజంపేట, చిత్తూరు ఎం.పి లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,ఎన్. రెడ్డప్ప కమిటీకి వివరించగా..  ఉ. 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు అందిస్తున్న సేవల గురించి అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఆదునిక పద్దతిలో వ్యవసాయ సాగు అంశాలన్నింటిపై సమగ్రంగా వ్యవసాయ అధికారి కమిటీకి సవివరంగా వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పౌర సేవలను సులభతరం చేసేందుకు తీసుకొని వచ్చిన సచివాలయ వ్యవస్థ కు సంబందించి మతుకు వారి పల్లె లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సంధర్భంగా సచివాలయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన అర్హుల జాబితాను పరిశీలించిగా సచివాలయ వ్యవస్థ ద్వారా 545 పౌర  సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు సచివాలయ సిబ్బంధి కమిటీకి వివరించారు.  తదుపరి కల్లూరు వద్ద ఎస్‌డబ్ల్యూ‌పి‌సి కింద నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించగా చెత్త సేకరణ దాన్ని ఎరువుగా తయారు చేసే విధానం గురించి అధికారులు కమిటీకి వివరించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృది శాఖ కమిషనర్ గిరిజా శంకర్, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఎన్‌ఆర్‌ఈజిఎస్ డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)రాజశేఖర్, డి.ఆర్.ఓ మురళి, తిరుపతి ఆర్.డి.ఓ కనక నర్సారెడ్డి, వ్యవసాయ శాఖ జే‌డి విజయ కుమార్, డి.పి.ఓ దశరామిరెడ్డి, ఎస్.ఈ పంచాయతీ రాజ్ అమర నాధ్ రెడ్డి,ఆర్&బి ఎస్‌ఈ విజయకుమార్, హౌసింగ్ పి.డి. పద్మనాభం, జెడ్‌పి సి‌ఈ‌ఓ ప్రభాకర్ రెడ్డి, ఎం‌పి‌డి‌ఓ దేవేంద్ర బాబు, ఎం‌ఆర్‌ఓ విజయ సింహా రెడ్డి, ప్రజాప్రతినిధులు పోకల అశోక్ కుమార్, విరూపాక్షి జయచంద్ర రెడ్డి, ఇతర సంబందిత అధికా రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.