తూర్పులో 2211 మందికి కోవిడ్ వేక్సిన్..
Ens Balu
3
Kakinada
2021-01-16 21:40:23
తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజు శనివారం మొత్తం 2211 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకి ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 33 టీకా కేంద్రాల ద్వారా తొలిరోజు 3300 మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. వివిధ కేంద్రాల్లో జరిగిన టీకా పంపిణీ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు వెల్లడించారు. కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రాం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలు టీకా పంపిణీ కార్యక్రమాలకు హాజరైనట్లు వెల్లడించారు.