డీప్ వాటర్ పోర్టు ద్వారానే ఎగుమతులు..
Ens Balu
9
Kakinada
2021-01-16 21:45:13
యాంకరేజ్ పోర్టుకు వచ్చే అదనపు సరుకును కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండ డీప్ వాటర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరగనుందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీ శ తెలిపారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జెసి లక్ష్మీ శ,ఏపీ మారి టైం బోర్డు సీఈవో రామకృష్ణ రెడ్డి తో కలిసి రైస్ ఎక్స్ పోర్టర్స అసోసియేషన్ ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కాకినాడ యాంకర్ ఏజ్ పోర్ట్ నుంచి బియ్యం దేశ విదేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఎగుమతి సామర్థ్యాన్ని పెంచే విధంగా యాంకరేజ్ పోర్టుకు వచ్చే అదనపు సరుకును కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా డీప్ వాటర్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను, సూచనలు సోమవారం నాటికి తెలియపరచాలని జెసి సూచించారు. ఈ సమావేశంలో పోర్టు అధికారి కెప్టెన్ ధర్నా, రైస్ ఎక్స్ పొర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.వి కృష్ణారావు, కాకినాడ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వి.వి.రాఘవులు, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎం బుల్లి రాణి,కార్మిక సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.