19న సులభతర వాణిజ్యంపై సదస్సు..
Ens Balu
4
Vizianagaram
2021-01-17 20:55:14
విజయనగరంలో సులభతర వాణిజ్య విధానాల్లో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల మంజూరులో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జనవరి 19న పారిశ్రామిక వేత్తలతో ఒక సదస్సు నిర్వహిస్తున్నట్టు పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కోట ప్రసాదరావు తెలిపారు.ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సు(out reach programme)లో రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ వినియోగించే పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొనే నిర్ధుష్టమైన సమస్యలపై చర్చించి వాటిపై తగిన వివరణలు, పరిష్కారాలు తెలియజేస్తారని జిల్లా మేనేజర్ పేర్కొన్నారు. ఈ సదస్సులో పరిశ్రమల శాఖకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ సదస్సుకు జిల్లాలోని భారీ, మెగా పరిశ్రమదారులు, సింగిల్ డెస్క్ పోర్టల్ వినియోగదారులు, స్థానిక పారిశ్రామిక అసోసియేషన్‌లు, ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్లు, స్థానిక ఆర్కిటెక్ట్ ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు హాజరు కావాలని కోరారు.