విద్యుత్ ధరల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ..
Ens Balu
13
Rajahmundry
2021-01-18 14:13:00
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంపుదల నేపథ్యంలో 3రోజులపాటు ఆందప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దూర దృశ్య సమావేశాల ద్వారా చేపట్టిందని ఏపీఈపిడిసిఎల్ ఎస్ఈ టివిఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. తొలిరోజైన సోమవారం విశాఖపట్నం సిఎండి కార్యాలయము నుంచి సిఎండి నాగలక్ష్మీ సెల్వారాజన్ నిర్వహించిన బహిరంగ ప్రజాబిప్రాయ సేకరణ దూర దృశ్య సమాశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 నుంచి 20 వరకు ఏ డిస్కమ్ పరిధిలోని వారైనా ఆన్‌లైన్ పాల్గొనవచ్చునన్నారు. రాష్ట్రంలో మూడు డిస్కమ్‌లైన తూర్పు, దక్షిణ కేంద్ర పంపిణిలు ఈ ధపా ప్రజాబిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. 2020-21 వార్షిక సంవత్సరం ఆదాయం అవసర నివేదికలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయన్నారు. కోవిడ్-19 మూలంగా పారిశ్రామిక, వాణిజ్య రంగాలు పనిచేయనికారణంగా ఆదాయాలు తగ్గాయన్నారు. తదనుగుణంగా వార్షికా ఆదాయం కూడా బాగా తగ్గిందన్నారు. 2020-21 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు, ఇతర ఆదాయాలు రూపంలో డిస్కమ్‌లు ఆశించిన స్దాయిలో ఆదాయం సమకూరలేదన్నారు. కాని 2020-21 లో అనుభవాలు, పెరిగిన ఖర్చులు విద్యుత్ వినియోగం పెరిగిన అంచనా నేపధ్యంలో 2021-22లో కూడా ఆప్రబావం ఉంటుందన్నారు. 2021-22 ఆర్దిక సంవత్సరం వార్షిక ఆదాయ అవసరాలు రిటైల్ ధరలపై ఆంధప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సి.వి నాగార్జునరెడ్డి మరియు మండలి సభ్యులు పి. రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్, రాంసింగ్ నేతృత్వంలో వినియోగదారులను నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరిస్తున్నారని ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటిగంటవరకు మరలా మధ్యాహ్నాం రెండు గంటలనుంచి సాయాంత్రం 4.30 గంటలకు ప్రజాభిప్రాయాలను స్వీకరించడం జరుగుతోందన్నారు. విద్యుత్ చార్జీలకు సంబందించి డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ ఈ ధపా పూర్తిగా ఆన్‌లైన్‌లో చేపట్టాలని ఎ.పి విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిందన్నారు. కోవిడ్-19 దృష్టిలోవుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. అదే సమయంలో దీనివల్ల గతానికి భిన్నంగా విస్తృతస్దాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలవుతునందని మండలి చైర్మన్ జస్టిస్ సి.వి నాగార్జునరెడ్డి తెలిపారన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గోన దలచినవారు ముందుగా ఇప్పటికే తమ తమ పేరు నమోదు చేసుకున్నారని వీరికి ఈ మూడు రోజులలో స్లాట్ ఇవ్వడం జరిగిందన్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ద పరిధిలో సుమారు 52 మందికి స్లాట్లు ఇవ్వడం జరిగిందన్నారు. మన జిల్లా నుంచి ఆరు గురు ఉన్నారన్నారు. ఈ పక్రియను ఇంటోనే వుండి ప్రత్యక్షముగా తిలకించేందుకు ఒక ఇమెయిల్ Www.eliveevents.com./ apercpublichearing
లింకు రూపొందించడం జరిగిందన్నారు. విద్యుత్ టారీఫ్ రూపకల్పనలో ప్రజల అభిప్రాయాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరో కొద్దిమంది కాకుండా ఆసక్తి వున్న వారెవరైనా పాల్గొనేందుకు అవకాశం లబించిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్య నిర్వాహక ఇంజనీరు కె తిలర్ కుమార్. సీనియరు ఎకౌంట్సు అధికారి వి.వి.ఎస్.ఎన్ వరప్రసాద్ ట్రాన్సుపార్మర్లు డివిజనల్ ఇంజనీరు పి వెంకటేశ్వర్లు ఉప కార్యనిర్వహక ఇంజనీరు నటరాజన్ , ( రెవిన్యూ) సహాయ అధికారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.