ట్రాఫిక్ నిబంధనలపై మరింత అవగాహన..
Ens Balu
3
Srikakulam
2021-01-18 14:15:48
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయం వద్ద 32వ రహదారి భద్రతా మాసోత్సవాల పోస్టరును విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి ఫిబ్రవరి 17వ తేదీ వరకు నెల రోజుల పాటు రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదన్నారు. ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆటో డ్రైవర్లతో సమావేశాలు నిర్వహించి వారికి రహదారి భద్రతపై అవగాహన కలిగిస్తామన్నారు. రహదారి ప్రమాదాలలో ప్రాణ నష్టం సంభవించడం దురదృష్టకరమని అన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి వుండాలని, నిబంధనలను తప్పని సరిగా పాటించాలని అన్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని తెలిపారు. అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ ఏఎస్పీ విఠలేశ్వర రావు, ఏఎస్పీ సోమశేఖర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు, ట్రాఫిక్ ఎ.స్ఐ. లక్ష్మణ్ రావు, రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి. జగన్మోహన్ రావు, ప్రజా రావాణా శాఖ డిప్యూటీ సి.టి.ఎం. జి.వరలక్ష్మి, ఆటో డ్రైవర్లు, హీరో షో రూమ్ సిబ్బంది పాల్గొన్నారు.