శ్రీకాకుళంలో స్పందనకు 37 వినతులు..
Ens Balu
2
Srikakulam
2021-01-18 14:26:45
శ్రీకాకుళంజిల్లాలో స్పందన కార్యక్రమానికి 37 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖకు చెందినవి 7 కాగా, పౌర సరఫరాల శాఖకు చెందినవి 7 వినతులు కాగా ఇతర శాఖలకు సంబంధించినవి 23 వినతులు ఉన్నాయని డిఆర్ఓ తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రజలు తమ ఫిర్యాదులను తెలియజేసారని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు బదలాయించి వాటికి వారంరోజుల్లో పరిష్కారం చూపించాల్సింది ఆదేశించినట్టు డిఆర్వో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ నుండి చలమయ్య, స్పందన విభాగం సూపర్ వైజర్ బి.వి.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.