అవగాహనతోనే ప్రమాదాల నియంత్రణ..
Ens Balu
4
Kakinada
2021-01-18 16:04:39
రోడ్డు ప్రమాదాలపై ప్రజలను చైతన్యం చేయడం ద్వారా ప్రమాదాల సంఖ్యలను తగ్గించవచ్చునని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం 18 నుంచి ఫ్రబ్రవరి 17 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు సిద్ధం చేసిన వాల్ పోస్టర్ ను ఆయన జాయింట్ కలెక్టర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాసోత్సవాల సమయంలోనే కాకుండా నిత్యం రవాణా శాఖ ప్రమాదాల నియంత్రణంలో కీలక భూమిక వహించాలన్నారు. ముఖ్యంగా కళాశాలలు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ట్రాన్స్ పోర్టు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డి ఆర్ వో సిహెచ్.సత్తిబాబు,జిల్లా అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, సీవిల్ సప్లైస్ డీఎం ఇ. లక్ష్మీ రెడ్డి, కాకినాడ ఆర్టీవో ఏజీ. చిన్నికృష్ణ, డిటిసి సిహెచ్.ప్రతాప్, ఆర్ టీవో ఆర్.సురేష్, బీసీ, ఎస్సీ,మైనారిటీ కార్పొరేషన్ ఈడీ లు, మొబైల్ వాహనాల కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.