కరోనా వేక్సిన్ ను వినియోగించుకోవాలి..
Ens Balu
2
Rajahmundry
2021-01-18 16:48:35
మానవాళిని ఏడాది కాలం పాటు భయబ్రాంతులకు గురి చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న covid 19 వ్యాధికి వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన నగరపాలక సంస్థ పరిధిలోని నారాయణపురం నగరపాలక సంస్థ యు పి హెచ్ స్కూల్ నందు కరోనా వ్యాధి నిరోధక టీకాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా 24 మంది వైద్య సిబ్బందికి టీకాలు వేయడం జరిగింది అన్నారు మొదటి దశ టీకాలు వేసే కార్యక్రమం నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 28 నాటికి పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. స్థానికంగా రిసెప్షన్ సెంటర్ అబ్జర్వేషన్ రూమ్ లను ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నిపుణులైన సీనియర్ జూనియర్ వైద్యులను అబ్జర్వేషన్ కొరకు నియమించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన సురక్షితమైన వ్యాధి నిరోధక టీకాలను మాత్రమే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మొదటి డోసు వేసుకున్నాక 28 రోజులలో మరల రెండో ఢొసు అదే కంపెనీకి చెందిన మందును వేయించుకోవాలి అని ఆయన స్పష్టం చేశారు. టీకా వేసుకున్నాక ప్రతి ఒక్కరూ 42 రోజుల పాటు ముఖానికి మాస్క్ ధరించడం చేతులు శుభ్రం చేసుకోవడం భౌతిక దూరాలు పాటించడం వంటివి తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ప్రస్తుతం గర్భిణీలు బాలింతలు క్యాన్సరు హెచ్ఐవి బాధితులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తో బాధపడుతున్నవారు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన పిదప 14 రోజులు తర్వాత టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. టీకా వేయించుకున్న తరువాత 14 రోజులకు ఇమ్యూనిటీ వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వినూత్న అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోమలి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.