మనసున్న ఎంపీ విజయసాయి రెడ్డి..


Ens Balu
5
Andhra University
2021-01-18 17:03:46

ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ కుటుంబం ఆనందంగా ఉండాలని తద్వారా రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రేస్‌ ‌పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు అందించిన సంక్రాంతి కానుకలను సోమవారం ఉదయం ఏయూ జిమ్నాజియం మైదానంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, మనసుతో ఆలోచిస్తూ ప్రజల సమస్యలకు పరిష్కారాలను చూపే మంచి వ్యక్తిగా విజయసాయి రెడ్డి నిలుస్తారన్నారు. విశాఖ పాత్రికేయుల కుటుంబాలలో తాను ఒక సభ్యునిగా భావించి విజయ సాయి రెడ్డిగారు ఈ సంక్రాంతి కానుకలను అందించడం జరిగిందన్నారు. ఈ కానుకల రూపంలో ఆయన పాత్రికేయులపై తనకున్న ప్రేమను చాటారన్నారు. అందరికీ తల్లిలా నిలచే విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన సూచించిన విధంగా దీనిని ఏర్పాటు చేసామన్నారు.  విశాఖ నగరం అభివృద్ది చెందితే ప్రతీ వ్యక్తి అభివృద్ది చెందడం సాధ్యపడుతుందన్నారు. ఈ పక్రియలో పాత్రికేయులు భాగస్వాములు కావాలని సూచించారు. గతంలో విశాఖ అన్నివిధాలుగా అణగదొక్కబడిందని, నేడు విశాఖ అభివృద్ది చెందుతోందన్నారు. తూర్పు తీరానికి ఆర్ధిక రాజధానిగా విశాఖ నిలుస్తుందన్నారు. సమాజానికి అవసరమైన నిపుణతతో కూడిన విలువైన మానవ వనరులను ఆంధ్రవిశ్వవిద్యాలయం అందిస్తుందన్నారు. 98 వార్డుల పరిధిలోని ప్రతీ పాత్రికేయునికి ఈ సంక్రాంతి కానుకను అందించే విధంగా ఏర్పాట్లు చేసామన్నారు. ఇటీవల నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ‌క్రికెట్‌ ‌టోర్నమెంట్‌ ‌విజయవంతం అయిందని, దీనికి సహకారం అందించిన పాత్రికేయులకు వీసీ కృతజ్ఞతలు తెలిపారు. ‌సీనియర్‌ ‌పాత్రికేయులు లీడర్‌ ‌పత్రిక సంపాదకులు వి.వి రమణ మూర్తి మాట్లాడుతూ కోవిడ్‌ ‌లాక్‌డౌన్‌ ‌సమయంలో సైతం విజయసాయి రెడ్డిగారు  పాత్రికేయులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై సత్వరం స్పందిస్తూ పరిష్కారానికి ఆయన చొరవ చూపడం జరుగుతోందన్నారు. ఏయూను మహోన్నత శిఖరాలకు తీసుకువెళ్లే దిశగా వీసీ ప్రసాద రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. విజెఎఫ్‌ అద్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరుకు విజయసాయి రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమానికి సైతం విజయసాయి రెడ్డి విచ్చేసి పాత్రికేయులపై తన అభిమానాన్ని చాటారన్నారు. కార్యక్రమంలో విజెఎఫ్‌ ‌కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, ఏయూ క్రీడా విభాగ సంచాలకులు ఆచార్య ఎన్‌.‌విజయమోహన్‌, ఏయూ చీఫ్‌ ‌సెక్యూరిటీ ఆఫీసర్‌ ‌ఖాన్‌, ఏయూ గెస్ట్ ‌హౌస్‌ ‌డీన్‌ ‌టి.షారోన్‌ ‌రాజు, విజయసాయి రెడ్డి మీడియా సమన్వయ అధికారి జి.రమేష్‌ ‌బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్ట్‌లకు సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. విజెఎఫ్‌ ‌కార్యవర్గ సభ్యులు నాగరాజు పట్నాయకర్‌, ‌దాడి రవికుమార్‌, ‌గయాజ్‌, ఎం.ఎస్‌.ఆర్‌ ‌ప్రసాద్‌, ఈశ్వర రావు,శేఖరమంత్రి తదితరులు సమన్వయం చేశారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్‌ ఆఫ్‌ ‌థియేటర్‌ ఆర్టస్ ‌విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.