ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ అమలు..


Ens Balu
2
Anantapur
2021-01-18 17:11:53

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎన్నికల మేనిఫెస్టో  ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమాత్యులు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండలం పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి మరియు రాష్ట్ర మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖమాత్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు ఉషాశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, పివి.సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి బొత్స మాట్లాడుతూ ముందుగా ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ పెద్ద పండుగ అయిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్నామని, పసలూరు కొత్తపల్లి వద్ద ఉప్పరపల్లి లేఔట్ లో 1628 మందికి 38 ఎకరాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,549 మందికి ఇంటి స్థలాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1100 గ్రామాలు ఉంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద కొత్తగా 1045 నగరాలు, నగర పంచాయతీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతల భావిస్తూ, మేనిఫెస్టో లోని ప్రతి అంశాన్ని నెరవేర్చడమే మన ధ్యేయం అని సీఎం అన్నారని, చెప్పినట్లు గానే ఇళ్ల పట్టాలిస్తున్నామన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తున్నామని, స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం ఇచ్చిన మాటను నెరవేర్చి పేదల సొంతింటి కలను తీర్చిన ముఖ్యమంత్రి ఒక్క వైయస్ జగన్ తప్ప ఎవరు లేరన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూశామని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకున్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమం అమలు చేస్తే కుటుంబాలు సంతోషంగా ఉంటాయో అలాంటి కార్యక్రమాలను సీఎం చేస్తున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, ఏడి సి సి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పి వి ఎన్ఎన్ మూర్తి, ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మీ నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.