గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి..


Ens Balu
3
Vizianagaram
2021-01-18 17:18:50

 జనవరి 26న నిర్వహించే  గణతంత్ర దినోత్సవ వేడుకులకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ ఆదేశించారు.   సోమవారం స్పందన అనంతరం జిల్లా అధికారులతో గణతంత్ర  వేడుకుల ఏర్పాట్ల పై  జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించే ఈ వేడుకులకు కవాతు, బందోబస్తు, బ్యాండ్ పార్టీ, ఓపెన్ టాప్ వాహనాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు సూచించారు.  జిల్లా రెవిన్యూ అధికారి ఆహ్వానాలు ప్రశంసా పత్రాలను తయారు చేయాలనీ అన్నారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది తో పాటు పచ్చదనాన్ని పెంపొందించిన వారికీ, రక్త దానం చేసిన వారికీ, పారిశుధ్యం, చెరువు శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన వారికీ కూడా   ప్రశంసా పత్రాలను అందజేయాలని సూచించారు.  ఈ సేవలను పరిష్కరించడం లో చొరవ చూపిన సచివాలయాల సిబ్బందిని కూడా  ప్రశంసా పత్రాల కోసం  ఎంపిక చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) ఆధ్వర్యం లో ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు జాబితాను సిద్ధం చేయాలన్నారు.    గత ఏడాదిగా  అన్ని శాఖల  ద్వారా చేపట్టిన అభివృద్ధి పై  ముఖ్య అతిధి ప్రసంగాన్ని తయారు చేయాలని సమాచార శాఖ  సహాయ సంచాలకులకు ఆదేశించారు.  అదే విధంగా గత ఏడాదిగా జిల్లాలో జరిగిన అభివృద్ధి పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చే యాలని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్  ద్వారా త్రాగు నీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలు చేయాలనీ,  సమాహర శాఖ ఇంజినీర్ పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయనగరం రెవిన్యూ డివిజినల్ అధికారి సీటింగ్ , ప్రోటోకాల్ ఏర్పాట్లను చేయాలనీ,  తహసిల్దార్ స్నాక్స్ ఏర్పాటు చేయాలనీ అదేశించారు .  దేశ భక్తి గీతాల ఆలాపన,  సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు జిల్లా విద్య శాఖ అధికారి చూడాలన్నారు.  ముఖ్యమైన శాఖలన్నీ  స్టాళ్ళ ప్రదర్శన కు సిద్ధంగా ఉండాలని,  అయితే సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ళ ప్రదర్శన  కోవిడ్ దృష్ట్యా ఉన్నదీ లేనిదీ త్వరలో తెలియజేస్తామని  అన్నారు.            ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు  డా. ఆర్. మహేష్ కుమార్,   జే. వెంకట రావు, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, జిల్లా అధికారులు హాజరైనారు.