కొత్తకాలనీల్లో సచివాలయ సిబ్బంది కీలకం..


Ens Balu
4
Srikakulam
2021-01-18 21:14:03

జగనన్న కాలనీల నిర్మాణంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీల పాత్ర కీలకమైనదని నగరపాలక సంస్థ కమీషనకు పి.నల్లనయ్య పేర్కొన్నారు.  సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పేదలందరికీ ఇళ్ళు-వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీలకు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయీ శిక్షణా కార్యక్రమం జరిగింది.  గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయిలో రెండురోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య విచ్చేసారు. ఈ సందర్భంగా కమీషనరు మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యాక్రమం జగనన్న కాలనీల నిర్మాణ కార్యక్రమమని అన్నారు.   ఇళ్ళ నిర్మాణంలో వీరి పాత్ర  కీలకమైనదన్నారు.  నిర్మాణానికి కావలసిన మెటీరియల్ ఇండెంట్, మెటీరియల్ పంపిణీ, ఎం.బుక్ రికార్డింగ్, పేమెంట్స్, తదితర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. హౌస్ నిర్మాణంలో ఉన్న అంగీకార పత్రాలు తీసుకోవటంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ శిక్షణ పొందినవారు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేయాలి అన్నారు.  ఈ శిక్షణ కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. టి.వేణుగోపాల్, ఇ.ఇ. కూర్మి నాయుడు, డి.ఎల్.డి.ఓ.  అలివేలు మంగమ్మ, డిప్యూటీ ఇ.ఇ. కె.వి.డి.నాగేశ్వర రావు, ఎ.ఇ.లు, గార ఎం.పి.డి.ఓ.  రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమినిటీస్, తదితరులు హాజరైనారు.