గణతంత్ర దినోత్సవానికి పక్కాఏర్పాట్లు..
Ens Balu
3
Srikakulam
2021-01-18 20:57:40
భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సోమ వారం కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ నెల 26వ తేదీ ఉదయం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భారత గణతంత్ర దినోత్సంను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవ నిర్వహణకు మైదానాన్ని సిద్దం చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. మైదానంలో తాగు తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని నగరపాలక సంస్ధ కమీషనర్ ను ఆయన ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమ శాఖలు తమ శాఖల ప్రగతిని తెలియజేసే ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ శాఖలు, జలవనరుల శాఖ, అటవీ శాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్ధ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమం, ఎస్.సి, బి.సి సంక్షేమం, రహదారి భద్రత –పోలీసు, అగ్నిమాపక శాఖ, విద్యా, వైద్య శాఖలు ప్రదర్శన శకటాలను సిద్ధం చేయాలని, శాఖల ప్రగతిని తెలియజేసే ప్రదర్శన శాలలను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు గణతంత్ర దినోత్సవం నిర్వహించే మైదానంలో ఉదయం నిర్వహించాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
22 నాటికి ప్రశంసా పత్రాలకు జాబితాలు సమర్పించాలి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు అందించే ప్రశంసా పత్రాలకు జాబితాను ఈ నెల 22వ తేదీలోగా సమర్పించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతిభ ప్రశంసా పత్రాలు అందుకునే వారు ఉత్తమ ఉద్యోగులుగా ఉండాలని, ఇతర ఉద్యోగులకు ప్రేరణ కలగాలని అన్నారు. ఉద్యోగుల పేర్లతోపాటు వారు ఏ విధంగా ప్రశంసా పత్రానికి అర్హులో తెలియజేస్తూ వివరణ విధిగా సమర్పించాలని ఆదేశించారు. ప్రశంసా పత్రం పొందినవారికి సార్ధకత ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, డిప్యూటి పోలీసు సూపరింటిండెంట్ ఎన్.ఎస్.ఎస్.శేఖర్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు, నగర పాలక సంస్ధ కమీషనర్ పి.నల్లనయ్య, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాస రావు, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.గోపాల కృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాస రావు, క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాబర్ట్ పాల్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.ఏ.ఈశ్వర రావు, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కే.రామారావు, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణారావు, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎల్.వేణుగోపాల్, ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్ వి.లక్ష్మి, సాంఘిక సంక్షేమ గురుకుల సమన్వయ అధికారి వై.యశోదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.