కరోనా వేక్సిన్ పై లేని అపోహలొద్దు..
Ens Balu
4
Visakhapatnam
2021-01-19 12:42:16
యావత్ ప్రపంచాన్ని ఏడాది కాలం పాటు భయబ్రాంతులకు గురి చేసి ఎంతోమంది ప్రాణాలు బలిగొన్న covid 19 వైరస్ కి వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని ప్రముఖ సంఘ సేవకులు, ధానకర్త సానారాధ పేర్కొన్నారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖజిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ద్వారా వేస్తున్న కరోనా వేక్సిన్ ను ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరోనా వేక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించుకోవాలని సూచించారు. పూర్తిగా ఆరోగ్యదాయమని రుజువైన తరువాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటిని ప్రజలకు అందిస్తుందని గమనించాలన్నారు. నిపుణులైన సీనియర్, జూనియర్ వైద్యుల పర్యవేక్షణలో ప్రభుత్వం నియమించి ప్రత్యేకంగా వీటిని ప్రజలకు ఈ వేక్సిన్ ను అందిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన సురక్షితమైన వ్యాధి నిరోధక టీకాలను మాత్రమే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని ఆమె వివరించారు. మొదటి డోసు వేసుకున్నాక 28 రోజులలో మరల రెండో ఢొసు అదే కంపెనీకి చెందిన మందును వేయించుకోవాలి ఆమె స్పష్టం చేశారు. టీకా వేసుకున్నాక ప్రతి ఒక్కరూ 42 రోజుల పాటు ముఖానికి మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాలు పాటించడం వంటివి తప్పనిసరిగా ఆచరించాలన్నారు. ప్రస్తుతం గర్భిణీలు బాలింతలు క్యాన్సరు హెచ్ఐవి బాధితులకు వ్యాధి నిరోధక టీకాలు వేయడం లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తో బాధపడుతున్నవారు నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన పిదప 14 రోజులు తర్వాత టీకా తీసుకోవాలని ఆమె కోరారు. టీకా వేయించుకున్న తరువాత 14 రోజులకు ఇమ్యూనిటీ వస్తుందని ఆమె చెప్పారు. ఈ వేక్సిన్ ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కరోనా రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని సానారాధ పిలుపునిచ్చారు.