ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరం..
Ens Balu
2
Srikakulam
2021-01-19 18:56:40
శ్రీకాకుళం జిల్లాలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భారీ వాక్తాన్ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) వి.పి.విఠలేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని వాక్తాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ప్రస్తుతం 32వ జాతీయ రహదారి భద్రత మాసోత్సావాలను నిర్వహించుకుంటున్నామని, జిల్లాలో ఏ ఒక్కరూ వాహన ప్రమాదంలో ప్రాణాలు కోల్పొకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. ద్విచక్ర , త్రిచక్ర, కార్లు మరియు బారీ వాహనాలు నడిపే డ్రైవర్లు మధ్యం సేవించి వాహనాలను నడపరాదని పేర్కొన్నారు. తద్వారా ప్రమాదాలు జరిగి వారితో పాటు వారి కుటుంబాలు కూడా రోడ్డున పడతాయనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం వలన ఎటువంటి ప్రమాదాలు జరగవని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,
హెల్మెట్ ధరించడం వలన తమతో పాటు తమ కుటుంబానికి మంచి రక్షణ కవచంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వారికి వాహనాలు ఇవ్వరాదని సూచించారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, అంతేకాకుండా భారీమొత్తంలో అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండబోదని తెలిపారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది. ర్యాలీ అనంతరం 2019 సం.లో జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ పొందిన అప్పల రాజు, కబాడ్డీ పోటీలలో గోల్డ్ మెడల్ పొందిన హేమ మరియు ఈశ్వరరావు తదితరులకు జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డి.ఎస్.పి ప్రసాదరావు, నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, వన్ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సి.అంబేద్కర్, టు టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ పి.వి.రమణ, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, సీనియర్ పాత్రికేయులు యస్.జోగినాయుడు, పోలీసు సిబ్బంది, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.