విద్యార్ధుల్లో మార్పు కోసమే నాడు-నేడు..


Ens Balu
4
Srikakulam
2021-01-19 19:15:53

విద్యార్ధుల అలవాట్లలో మంచి మార్పు కోసమే నాడు-నేడు కార్యక్రమమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.  మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో  మండల అభివృధ్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులతో నాడు-నేడు పనుల పురోగతిపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  పాఠశాలలలో పెయింటింగ్స్, డ్రింకింగ్ వాటర్, మేజర్, మైనర్ రిపేర్లు, యూరినల్ బౌల్స్ అమరికి తదతర అంశాలపై సమీక్షించారు. వెస్టర్న్ టాయిలెట్స్,  వాడకం ద్వారా పిల్లలలో మంచి ఆరోగ్యకరమైన మార్పు వస్తుందన్నారు.  టాయ్ లెట్లను పరిశుభ్రంగా నిర్వహించాలన్నారు.  అమ్మ ఒడి  మొత్తం నుంచి వెయ్యేసి  రూపాయలను టాయ్ లెట్ మెయింటినెన్స్ కోసం ఖర్చు చేయాలన్నారు. మేజరు, మైనర్ మరమ్మత్తులను పూర్తి చేయాలని పూర్తయిన వాటి ఫోటోలను పంపించాలని చెప్పారు.  పాఠశాలలలో ఎలక్ర్టిఫికేషన్ పూర్తి చేయాలన్నారు.   పాఠశాల లోపల, బయట పెయింటింగ్  జాగ్రత్తగా  వేయాలన్నారు. పెయింటర్లకు శిక్షణ నివ్వాలన్నారు. బయట మెషిన్ తోను, లోపల రోలర్ తోను పెయింట్ వేయాలన్నారు. కె.జి.బి.వి. పాఠశాలలలో ఆర్.ఓ. ప్లాంట్లను అమర్చాలన్నారు. కాంపౌండ్ వాల్స్ ఈ నెలాఖరునాటికి పనులను పూర్తి చేయాలని తెలిపారు.  ఎం.ఇ.ఓ.లు, ఎ.ఇ.లు శ్రధ్ధ వహించాలన్నారు. ఉపాధిహామీ పనుల పురోగతిపై సమీక్షిస్తూ, బి.టి.రోడ్లు, సి.సి.రోడ్లు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ ల నిర్మాణం  తదితర ఇంజనీరింగు పనులపై మండలవారీగా లక్ష్యాలతో ప్రగతి సాధించాలన్నారు. మండలంలో వారానికి ఒక కిలో మీటరు చొప్పున రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. శత శాతం పురోగతి కనిపించాలన్నారు. నిర్మాణాలలో పురోగతి కనపడాలన్నారు.  నిర్ధుష్ట ప్రణాళికతో పనులను పూర్తి చేయాలని తెలిపారు.                  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, పంచాయితీ రాజ్ ఎస్.ఇ. కె.భాస్కర్, ఎస్.సి.కార్పోరేషన్ ఇ.డి.రామారావు, బి.సి.కార్పోరేషన్ ఇ.డి.రాజారావు, ఫిషరీస్ జె.డి.శ్రీనివాసరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఇ.ఇ. మురళి, డిప్లూటీ డి.ఇ.ఓ.లు పగడాలమ్మ, విజయకుమారి,  ఆర్.డబ్ల్యు.ఎస్.  ఎస్.ఇ. శ్రీనివాసరావు, డి.ఇ.లు, ఎ.ఇ.లు తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.