ఫిబ్రవరి 1 నుంచే ఇంటికే రేషన్ సరుకులు..
Ens Balu
2
Vizianagaram
2021-01-19 19:46:34
బియ్యం కార్డుదారులందరికి ఫిబ్రవరి 1 నుండి ఇంటివద్దకే వాహనాల ద్వారా రేషన్ అందించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరు కున్నాయని , ఈ నెల 21 న పిటిసి లో లబ్దిదారులందరికి వాహనాలను కేటాయించనున్నట్లు తెలిపారు. మంగళ వారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, అదనపు ఎస్.పి శ్రీ దేవి రావు తో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ సరఫరా కోసం జిల్లాకు 458 వాహనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఈ వాహనాల ద్వారా జిల్లాలోని 778 సచివాలయాల పరిధి లో నున్న 1407 రేషన్ దుకాణాల నుండి ఇంటింటికి రేషన్ అందజేయడం జరుగుతుందని, ప్రతి వాహనం ద్వారా సుమారు 1500 కార్డు దారులకు సరఫరా చేస్తారన్నారు.
లబ్ది దారుల ఎంపిక రిజర్వేషన్ ప్రకారంగా పారదర్శకంగా జరిగిందని, మండల స్థాయి స్క్రీనింగ్ కమిటి ఎంపిక చేసిన వారి జాబితాలను జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు ఆమోదించిన తర్వాత లబ్ది దారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. వాహనాలను నడిపే ప్రతి ఆపరేటర్ కు ఒక వి.ఆర్.ఓ ను నోడల్ అధికారిగా డిజిగ్నేట్ చేయడం జరిగిందని, వీరి పర్యవేక్షణ లో రేషన్ సరఫరా జరుగుతుందని తెలిపారు. ఆపరేటర్లకు టి షర్టు లను ఏక రూప దుస్తులుగా ఇవ్వడం జరుగుతుందని, ప్రతి వాహనం రిజిస్ట్రేషన్, ఇన్సురెన్సు , బ్యాంకు ఋణం, తదితర అవసరాలను సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) వారు పర్యవేక్షిస్తారని అన్నారు. పంపిణీ విధానం, ఈ పోస్, తూకం, ఇంటర్ నెట్ వినియోగం తదితర అంశాల పై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆపరేటర్ లు గ్రామాల్లో నున్న డీలర్ లు , వాలంటీర్ ల తోపరిచయాలు చేసుకొని రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారని, పంపిణీ కి ఒక రోజు ముందే మెటీరియల్ అందజేయడం జరుగుతుందని అన్నారు.
కోవిడ్ నిబంధనలతో శంబర జాతర:
ఈ నెల 25, 26 తేదీలలో జరిగే శంబర పోలమాంబ జాతర కోవిడ్ నిబంధనలతో జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికి కోవిడ్ కేసు లు నమోదవుతున్నందున ప్రతి ఒక్కరు తప్ప కుండ మాస్క్ వాడాలని, భౌతిక దురాన్ని పాటించాలని అన్నారు. దేవస్థానం సిబ్బంది క్యూ లైన్ లలో సనిటైసేర్లను ఇవ్వాలని అన్నారు. భక్తులు పరిమిత సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తు ప్రచారం చెయ్యడం జరుగుతుందన్నారు. మొక్కుబడులున్న వారు మాత్రమే దర్శనాలకు రావలని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పోలీస్ శాఖ చేస్తుందన్నారు.
ఈ పత్రికా సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, పౌర సంబంధాల సహాయ సంచాలకులు డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.