యువత భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి..
Ens Balu
2
Tirupati
2021-01-19 19:50:13
యువత తమకు నచ్చిన ఆలోచన మేరకు ఆరంగాన్నే ఎంచుకుని పట్టుదలతో ఎదగాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త అన్నారు. ప్రేరణ యూత్ టాలెంట్ ఫెస్టివల్ 2021 ఎస్.వి. ఇంజినీరింగ్ కళాశాల ఆతిద్యంతో నెహ్రూ యువ కేంద్రం, సెట్విన్ ఆద్వర్యం లో రెండు రోజులు ఈ నెల 19,20 న నిర్వహించనున్న సంధర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా, ప్రత్యేక అతిధిగా ఎం.ఎల్.సి యండవల్లి శ్రీనివాసుల రెడ్డి జ్యోతిని వెలిగించి ప్రారంభిచారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ యువజన వారోత్సవాల అనేది యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వివిధ రకాల పోటీలను నిర్వహించడంతో పాటు. ఆయా రంగాల్లో విజేతలైన వారిని ప్రస్తుత తరంతో అనుసంధానించడానికి మరియు స్ఫూర్తి పరచడానికి "ప్రేరణ" అనే కార్యక్రమాన్ని నేడు 19, రేపు 20 తారీకున శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల తిరుపతి నందు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా యూత్ పార్లమెంట్ ,సైన్స్ ఎక్స్పో ,ఆర్ట్ ఎగ్జిబిషన్ ,కల్చరల్ ఫెస్ట్ ,షార్ట్ ఫిలిం కాంటెస్ట్, సివిల్ సర్వీసెస్ అవేర్నెస్, యువ రచయితల సమ్మేళనం ,సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీట్ తదితర కార్యక్రమాలను నెహ్రూ యువ కేంద్ర మరియు సెట్విన్ వారి సౌజన్యంతో జరగనున్నదని అన్నారు. తన తండ్రి ఆశయం మేరకు డాక్టర్, ఆతరువాత కలెక్టర్ అయ్యానని , మనకు ఏ రంగంలో ఆలోచన వస్తే వెంటనే దాన్ని ఎంచుకుని సాధించాలని అన్నారు. ఎం.బి.బి.ఎస్ రెండవ సంవత్సరం నుండే పది మంది పేదలకు సాయం చేయగలం అనే ఆశయంతో సివిల్స్ చదువుతూ రావడం జరిగిందని, మొదటి సారె 70 వ రాంకు, రాష్ట్రంలో మొదటి ర్యాంకు అందుకున్నానని తెలిపారు. యువతతో కలెక్టర్ ముఖాముఖీ నిర్వహించి సందేహాలను తీర్చారు.
ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే మానవ వనరులు, 75 శాతం యువత కలిగిన దేశం మన భారత దేశమని దేశ అభివృద్ధి అనేది యువతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. కోవిడ్ తో 2020 దౌర్భాగ్య సంవత్సరంగా మిగిలిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు వైద్య, విద్య, వ్యవసాయం పై దృష్టి పెట్టారని శుభ పరిణామమని అన్నారు. గాంధీజీ , అంబేద్కర్ ఆశయాల మేరకు యువత కుల మతాలకు అతీతంగా ఉండాలని అన్నారు. దేశంలో 2022 నాటికి స్కిల్డ్ యువత 15 కోట్ల మంది అవసరం ఉందని ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతతో ముందడుగు వేయాలని ఈ లెక్కలన్నీ ఎకనామిక్ ఫోరం చెపుతున్నదని తెలిపారు.నేడు 40 శాతం యువత గతం గురించి, మరో 40 శాతం భవిష్యత్ , 8 శాతం అనవసర విషయాలపై ఆలోచన, మిగిలిన 4 శాతం మంది మాత్రమే అవసరాలకనుగుణంగా సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. యువత రాజకీయాల్లో రాణిచడం, మేధావులు కావాలని ఆశిస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్నోవేషన్స్ ఇన్ స్టంట్ ఐడి కార్డు స్టార్టప్ విధానం వివరించారు. సంవేదన పేరుతో రక్తదానం బ్రోచర్ ను రిలీజ్ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, నెహ్రూ యువ కేంద్ర కొఆర్డినేటర్ ప్రదీప్, సెట్విన్ సి.ఇ.ఓ మురళీకృష్ణా రెడ్డి, కళాశాల ప్రినిసిపాల్స్ సుధాకర్ రెడ్డి, కల్పలత, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.