విశాఖ పోలీస్ బేరక్స్ లోనే పంద్రాగస్టు వేడుక...


Ens Balu
2
Visakhapatnam
2020-08-14 18:27:54

విశాఖపట్నం జిల్లాలో 2020 స్వాతంత్ర్య దినోత్సవ  వేడుకలు ఆగస్టు 15,  శనివారం ఉదయం  9గంటలకు  విశాఖపట్నం పోలీస్ బారెక్స్ స్టేడియంలో  జరుగుతాయని  జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్  తెలిపారు. శుక్రవారం నాడు  స్థానిక కలెక్టర్ కార్యాలయంలో  ఆయన  జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి  ముత్తం శెట్టి శ్రీనివాసరావు గౌరవ వందనం స్వీకరించి , జాతీయ పతాకాన్ని  ఆవిష్కరిస్తారని  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై  మంత్రి  ప్రసంగిస్తారని  తెలిపారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న విజేతలను సన్మానిస్తారని తెలిపారు.  ప్రంటులైన్  వారియర్సు గా  కోవిడ్ పై పోరాడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు, శానిటరీ ఉద్యోగులను  అభినందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ  తప్పని సరిగా మాస్క్ ధరించాలని  భౌతిక దూరం పాటించాలని  తెలిపారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ ఎం .వేణుగోపాలరెడ్డి,  డి ఆర్ ఓ ఎం .శ్రీదేవి,  ఆర్ డి ఓ పి.కిషోర్, ఇతర  జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
సిఫార్సు