క్రీడలతో రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలి..


Ens Balu
3
Andhra University
2021-01-20 18:27:05

యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలలో పతకాలు సాధించిన వారికి బుధవారం తన కార్యాలయంలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా  వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. యువత విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యువతను అన్ని రంగాలలో ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ ‌జగన్‌ ‌మోహన రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో 15 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న టోర్నమెంట్‌లో విశాఖ చిన్నారులు 10 బంగారు, 04 కాంస్య, 02 రజత పతకాలను సాధించడం గర్వకారణమన్నారు.  చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. వీరి సహకారం, తోడ్పాటుతో చిన్నారులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ పతకాలు సాధించడం సాధ్యపడుతోందన్నారు. బాలికలు, మహిళలకు ఆత్మరక్షణకు ఇటువంటి విద్యలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఇటువంటి విద్యలపై శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో  అకడమిక్‌ ‌డీన్‌ ఆచార్య కె.వెంకట రావు, విశాఖ తైక్వాండో అసోసియేషన్‌ ‌కార్యదర్శి పి.గణేష్‌ ‌కుమార్‌, ‌తైక్వాండో కోచ్‌ ‌మిథిలేష్‌ ‌కుమార్‌, అసోసియేషన్‌ ఇసి సభ్యులు ఎస్‌.‌మిలింద్‌ ‌కుమార్‌, ‌పతకాలు సాధించిన యువత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.