ఊరు చెరువును అభివృధ్ధి చేయాలి..


Ens Balu
3
Srikakulam
2021-01-20 18:43:23

ఊరు చెరువును సమగ్రంగా అభివృధ్ధి చేయడానికే మన ఊరు-మన చెరువు కార్యక్రమమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు.  బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మన ఊరు -మన చెరువు కార్యక్రమంపై సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఊరిలో వున్న చెరువును సమగ్రంగా అభివృధ్ధి పరచు నిమిత్తం మన ఊరు-మన చెరువు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు.  మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ నిధులతో ఇరిగేషన్ తో అనుసంధానం చేస్తూ  చెరువు పనులను చేపట్టాలన్నారు. ఇందు నిమిత్తం ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌనెంట్ నిధులను వినియోగించుకోవాలన్నారు.   మన ఊరు, మన చెరువు పనులతో పాటు  ఇరిగేషన్ ఛానల్ పనులు కూడా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. చెరువు అభివృధ్ధికోసం  వూరికి దగ్గరలో వున్న చెరువును గుర్తించాలన్నారు. చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి గాను. లెవెల్లింగ్, స్లోపింగ్, స్టోన్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.  చెరువు వద్ద పిల్లలు ఆడుకొనే విధంగాను  పరికరాలను అమర్చాలని ఆట స్థలంగా అభివృద్ధి చేయాలని తెలిపారు . చెరువు చుట్టూ మంచి బౌండరీ కనిపించే విధంగా పూల మొక్కలు వేయాలన్నారు. ప్రజలు, టీచర్స్, టెక్నికల్ అసిస్టెంట్ల సహకారంతో   అభివృద్ధి కోసం చెరువును గుర్తించాలని చెప్పారు. అదే విధంగా  ఇరిగేషన్   ఫీల్డ్ చానెల్స్ మరమ్మత్తులు సైతం ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టాలని అన్నారు. స్లూయీస్ రిపేర్లు, పూడిక తీత పనులు, బ్రీచెస్, లీకేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది ఇరిగేషన్ చేనెల్స్ ద్వారా 2200 క్యూసెక్స్ నీరు విడుదలకు అవసరమైన పనులను చేపట్టాలన్నారు. ఆయకట్టు అభివృద్ధితో అన్ని మండలాలకు నీరు అందించాలన్నారు. సంయుక్త కలెక్టర్  శ్రీ రాములు నాయుడు మాట్లాడుతూ, మే నెలాఖరు నాటికి పనులు పూర్తి కావాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పనులు  చేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతీ మండలంలో ఒక చెరువును మోడల్ చెరువుగా అభివృద్ధి చేయాలని, ఈ చెరువు స్ఫూర్తితో అన్ని చెరువులను బాగా రూపొందించాలని తెలిపారు. వంశధార ఎస్ ఈ మాట్లాడుతూ, వంశధార ఎడమ కాలువ ఆధునికీకరణ చేయాలన్నారు. ఓపెన్ హెడ్ ఛానెల్, రైట్ మెయిన్ ఛానల్ మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. ఇరిగేషన్, ఉపాధి హామీ ద్వారా మెటీరియల్ కాంపౌనెంట్ తో జూన్ లోగా పనులు పూర్తి చేయాలన్నారు. ముందుగా బాగా పాడయిన చానెల్స్ అభివృధ్ధి పరచి సాగు విస్తరణకు కృషి చేయాలన్నారు.                                       ఈ  సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మా రావు, వంశధార ఎస్.ఈ. తిరుమల రావు,  ఇరిగేషన్ ఎస్.ఈ ఎస్ వి రమణా రావు, ఇంజనీరింగ్  అధికారులు,  ఏ పి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.