మహాత్ముల సేవలు మరువరానివి..గంట్ల


Ens Balu
3
Visakhapatnam
2020-08-15 18:41:08

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది మహాత్ములు అందించిన సేవలు మహనీయ మని వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్య క్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు..శనివారం విశాఖలోని సీతమ్మధార విజేఫ్  వినోద వేదికలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు సెల్యూట్ చేసారు. అనంతరం శ్రీనుబాబు  మాట్లాడుతూ, ఎంతోమంది త్యాగమూర్తుల త్యాగ ఫలితం వల్లే భారతీయులందరికి  స్వాతంత్ర్య ఫలాలు సిద్దించాయన్నారు.  వారి పోరాట పటిమ,. ప్రశంసనీయమన్నారు. జర్నలిస్ట్ ల సంరక్షణ  కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచేయాలన్నారు. త్వరలో ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలన్నారు. విజేఫ్  కార్యదర్శి ఎస్.దుర్గారావు మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వ  నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ పాలకవర్గం  పూర్తిస్థాయిలో కృషి చేస్తోందన్న ఆయన భవిష్యత్తులో  సభ్యులు సంక్షేమమే లక్ష్యంగా మ పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఇరోతి  ఈశ్వర్ రావు, వరలక్ష్మి, డేవిడ్  తో పాటు ఎల్లేశ్వరరావు, కిల్లి ప్రకాష్ రావు, పి.నగేష్ బాబు, సునీల్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు