వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివ్రుద్ధి..


Ens Balu
2
Puttur
2021-01-23 14:41:06

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో అనూహ్యంగా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని  నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా పేర్కొన్నారు.  శనివారం పుత్తూరులో తుడా పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ నిధులు కోటి రూపాయల నిధులతో పుత్తూరు ఎంపిడిఓ కార్యాలయం ప్రక్కన నర్సరీ స్థలంలో పార్క్ ను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు ఆనందంగా వుందన్నారు. ప్రజోపయోగ పథకాలు, కార్యక్రమాలకు తమ ప్రభుత్వం నిలువుటద్దమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, మాహిన్, జయప్రకాష్, అంకయ్య, సంపత్ కుమార్, గణేష్, మునికృష్ణ, లారీ మోహన్,  మోహన్ రెడ్డి, కరుణ, ఏకాంబరం, శ్రీనివాసులు, అన్న లోకనాదం, దేవేంద్ర, దిలీప్, శంకర్, కార్తీక్,  సునిల్,  చీరాల, లక్ష్మీ పతి, నారాయణ స్వామి, పుష్ప, బాలాజి, మునిసిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డి, తుడా కార్యదర్శి శ్రీలక్ష్మి , ఉద్యానవన శాఖ అధికారి మాలతి, ఎమ్మార్వో జయరాములు, ఎండిఓ  ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.